“ఇండియన్ 2” పై గట్టి హైప్ ఎక్కిస్తున్న శంకర్.. 

ఇండియన్ సినిమా దగ్గర ఎపుడో పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ ని తెచ్చుకున్న దర్శకుల్లో తమిళ దర్శకుడు శంకర్ కూడా ఒకరు. మరి శంకర్ దర్శకత్వంలో ఇప్పుడు తెరకెక్కుస్తున్న పలు భారీ చిత్రాల్లో ఉలగనయగన్ కమల్ హాసన్ నటిస్తున్న చిత్రం “ఇండియన్ 2” కూడా ఒకటి.

మరి దీనికి ముందు చిత్రం ఇండియన్ గాని అందులో కమల్ పోషించిన సేనాపతి పాత్ర గాని ఎంత పవర్ ఫుల్ అనేది సినిమా లవర్స్ కి బాగా తెలుసు. అందుకే మంచి క్రేజ్ దీనిపై నెలకొనగా ఈరోజు అయితే మేకర్స్ సాలిడ్ గ్లింప్స్ ని గ్రాండ్ గా రిలీజ్ చేస్తుండగా దర్శకుడు శంకర్ అయితే ఈ గ్యాప్ లో మరింత హైప్ ఎక్కిస్తున్నాడు.

లేటెస్ట్ గా రిలీజ్ చేసిన పోస్టర్ ఒకటి మళ్ళీ పాత రోజులు గుర్తు చేసింది. సేనాపతి దగగర్ ఉండే కత్తిని చూపిస్తూ ఒక్కసారి మళ్ళీ భారతీయుడు రోజులు గుర్తు చేసాడు. దీనితో ఈ సాయంత్రం బ్లాస్ట్ గట్టిగా ఉంటుంది అని చెప్పాలి. మరి ఈ అవైటెడ్ టీజర్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.

ఇంకా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ లు నటిస్తుండగా సిద్ధార్థ్, బ్రహ్మానందం తదితరులు నటిస్తున్నారు. అలాగే అనిరుద్ ఈ సీక్వెల్ ని ఏ ఆర్ రెహమాన్ ని రీప్లేస్ చేయగా లైకా ప్రొడక్షన్స్ వారు అయితే భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించగా దీనికి పార్ట్ 3 కూడా ప్లాన్ చేస్తున్నారు. 
https://x.com/shankarshanmugh/status/1720312394059047111?s=20