కమల్, చరణ్ సినిమాలపై శంకర్ నుంచి బిగ్ అప్డేట్స్.!

991953-director-shankar

ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక దర్శకుడు తన ఒక్క సినిమానే హ్యాండిల్ చేయడం కష్టం ఇక అందులోని పాన్ ఇండియా సినిమా అంటే అది మరింత స్థాయిలో ప్రెజర్ గా ఉంటుంది. కానీ సెన్సేషన్ పాన్ ఇండియా దర్శకుడు శంకర్ అయితే ఈజీగా రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు అయితే చేసేస్తున్నారు.

మరి ఈ చిత్రాల్లో ఒకటి ఉలగనయగన్ కమల్ హాసన్ తో చేస్తున్న మాసివ్ బడ్జెట్ సినిమా “ఇండియన్ 2” ఒకటి కాగా మరో చిత్రం అయితే గ్లోబల్ హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో చేస్తున్న “గేమ్ ఛేంజర్”. కాగా ఈ రెండు సినిమాల్లో శంకర్ బిజీగా ఉండగా ఒకదాని తర్వాత ఒక సినిమా షూట్ ని అయితే తాను చేస్తున్నారు.

ఇక ఇదిలా ఉండగా స్వయంగా శంకర్ ఒకేసారి రెండు సినిమాపై అప్డేట్స్ అందివ్వడం ఆసక్తిగా మారింది. మరి రీసెంట్ గానే తైవాన్ లో ఓ భారీ షెడ్యూల్ తర్వాత సౌత్ ఆఫ్రికా లో ఇంకో షెడ్యూల్ ని స్టార్ట్ చేశారు. మరి ఈ షెడ్యూల్ కూడా సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశామని తెలిపారు.

అంతే కాకుండా ఈ ఎపిసోడ్ మంచి పవర్ ప్యాకెడ్ గా వచ్చింది అని అదిరే అప్డేట్ అందించారు. ఇక చరణ్ సినిమాకి అయితే ఈ సినిమాకి ఇప్పుడు క్లైమాక్స్ ని స్టార్ట్ చేయనున్నామని ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు. అలాగే నెక్స్ట్ మళ్ళీ మే లో అయితే ఇండియన్ 2లో జాయిన్ కానున్నట్టుగా తెలిపారు. మొత్తానికి అయితే రెండు సినిమాల నుంచి రెండు బిగ్ అప్డేట్స్ బయటకి వచ్చాయి అని చెప్పాలి.