“ఇండియన్ 2” పై బిగ్ అప్డేట్ ఇచ్చిన శంకర్.!

991953-director-shankar

పాన్ ఇండియా దర్శకుడు శంకర్ ఇప్పుడు రెండు భారీ సినిమాలు ఒకేసారి చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఓ సినిమా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా “గేమ్ ఛేంజర్” అనే భారీ ప్రాజెక్ట్ చేస్తుండగా మరో సినిమా అయితే ఉలగనయగన్ కమల్ హాసన్ తో సెన్సేషనల్ సీక్వెల్ “ఇండియన్ 2” ని ఇప్పుడు చేస్తున్నారు.

ఇలా రెండు సినిమాలని కూడా శంకర్ ఓ ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. ఇక రీసెంట్ గానే గేమ్ ఛేంజర్ మీద సాలిడ్ అప్డేట్స్ ఇవ్వగా ఇప్పుడు అయితే ఇండియన్ 2 పై అప్డేట్ అందించారు. మరి గత కొన్ని రోజులు నుంచి అయితే వినిపిస్తున్న తైవాన్ షెడ్యూల్ ని ఇప్పుడు మేకర్స్ స్టార్ట్ చేసినట్టుగా శంకర్ తెలిపారు.

శంకర్ సినిమాలు అంటేనే ఓ రేంజ్ లో గ్రాండియర్ పైగా హాలీవుడ్ లెవెల్లో డిఫరెంట్ ఏక్షన్ బ్లాక్ లు అయితే డిజైన్ చేస్తారు. ఇప్పుడు అలాగే ఇండియన్ 2 లో కూడా భారీ సీన్స్ ని ప్లాన్ చేస్తుండగా వాటిలో ఓ కీలక ఏక్షన్ సీన్ నే ఇపుడు తైవాన్ దేశంలో ప్లాన్ చేశారట.

మరి కొన్ని రోజులు పాటుగా సాగనున్న ఈ షూట్ తో సినిమా సుమారు 70 శాతం మేర కంప్లీట్ కానున్నట్టుగా తెలుస్తుంది. కాగా ఈ భారీ సినిమాలో అయితే కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ లు హీరోయిన్స్ గా నటిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే లైకా ప్రొడక్షన్ హౌస్ వారు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో నిర్మాణం వహిస్తున్నారు.