చరణ్ ఫ్యాన్స్ కి నిరాశే మిగులుస్తున్న శంకర్..!

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి తెరకెక్కుతున్న పలు భారీ పాన్ ఇండియా చిత్రాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సెన్సేషనల్ పాన్ ఇండియా సినిమా గేమ్ చెంజర్ కూడా ఒకటి. కాగా ఈ భారీ చిత్రం కోసం అంతా ఎదురు చూస్తున్నారు కానీ దర్శకుడు శంకర్ అండ్ టీం మాత్రం ఫ్యాన్స్ కి ఒక రేంజ్ లో సినిమా షూటింగ్ అలా తెరకెక్కుతూనే ఉండగా.

సినిమా నుంచి అప్డేట్స్ కూడా చాలానే తక్కువ వచ్చాయి. కాగా ఈ చిత్రం నుంచి ఇప్పటికే మొదటి సాంగ్ సోషల్  అయ్యిపోగా చిత్ర యూనిట్ అయితే దీనిపై సీరియస్ కూడా అయ్యారు. కానీ వేంటనే ఆలస్యం లాంటిది చేయకుండా ఈ సాంగ్ కి దసరా కానుకగా రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయినట్టుగా రూమర్స్ వచ్చాయి.

అలాగే కొందరు సినీ ప్రముఖులు కూడా ఈ వార్తలు కన్ఫర్మ్ చేశారు. కానీ ఇప్పుడు మొదటి సాంగ్ రిలీజ్ ఆగిపోయినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. మేకర్స్ ఈ రిలీజ్ ని దసరా కి విడుదల చెయ్యట్లేదు అని తెలిపారు. దీనితో శంకర్ మాత్రం ఇంతలా ఫ్యాన్స్ కి నిరాశే మిగులుస్తూ వస్తుండడం మెగా ఫ్యాన్స్ ని డీలా పడేలా చేస్తుంది.

మరి దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. కాగా ఈ చిత్రానికి సంగీతం థమన్ అందించగా బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా అంజలి, శ్రీకాంత్ తదితరులు నటిస్తున్నారు. అలాగే బడా నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.