గత వారం రోజుల క్రితం హైదరాబాదులోని కెబిఆర్ పార్కు సమీపంలో నటి షాలూ చౌరాసియా పై దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే నటి
బుధవారం కొండాపూర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ దాటి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుంచి తను ఇక్కడికి వాకింగ్ వెళ్తున్నానని అయితే కేబీఆర్ పార్కు సీవీఆర్ గేట్ సమీపంలో కారు పార్కు చేసి సాయంత్రం 6 గంటలకు వాకింగ్ వెళ్లాను అని అయితే తిరిగి రాత్రి 8.15 గంటలకు తిరిగి వస్తుండగా వెనక నుంచి వచ్చిన తన నోట్లో బట్టలు పెట్టి ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశంలోకి లాకెళ్ళారనీ తెలిపింది.
ఆ సమయంలో తన చేతులు వెనక్కి గట్టిగా పట్టుకున్నారని, తనతో మాట్లాడుతూ తనకు అడిగినంత డబ్బు ఇస్తానని చెప్పడంతో తన చేతిని వదిలి పెట్టారు ఈ క్రమంలోనే 100 కి ఫోన్ చేశానని అది గమనించిన అగంతకుడు తన ఫోన్ లాక్కున్నాడు. అదేవిధంగా తన చేతికి ఉన్న డైమండ్ రింగ్ లాక్కొని తనపై దాడి చేశారని చెప్పారు.ఈ సమయంలోనే తన మోచేతితో దుండగుడి ప్రైవేటు పార్ట్ పై బలంగా కొట్టడంతో తనని వదిలి పెట్టాడని ఆ సమయంలోనే ప్రధాన రహదారివైపు ఉన్న ఫెన్సింగ్ దగ్గరకు వెళ్లి హెల్ప్ అని అడగడంతో అక్కడున్న వారందరూ రావడంతో అతను పారిపోయాడని తెలిపారు.
తనపై దాడి జరగడానికి తనకు ఎవరు శత్రువులు లేరు అని తెలిపిన ఈమె కెబిఆర్ పార్కులో వీలైనంత లైటింగ్స్ అమర్చాలని ఎఫ్‌డీసీ అధికారులకు సూచించారు. ఈ దాడి ఘటన గురించి పోలీసులకు తెలియగానే వెంటనే పోలీసులు బాగా స్పందించారని ఈ సందర్భంగా ఆమె వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇకపోతే ఈ దాడిలో భాగంగా సెల్ ఫోన్, డైమండ్ రింగ్ దొంగలించి తీసుకువెళ్లారని ఈమె మీడియా ముందు వెల్లడించారు.