ఇండియన్ సినిమా దగ్గర ప్రైడ్ ఇండియన్ దర్శకుడు ఇప్పుడు ఎవరు అంటే రాజమౌళి పేరు చెప్తారు అందరూ కానీ ఒక దశాబ్ద కాలం కితమే ఇండియన్ సినిమా బార్లు వరల్డ్ వైడ్ ఓపెన్ చేసిన దర్శకుడు మాత్రం శంకర్ అని చెప్పాలి. కాగా శంకర్ ఇప్పుడు తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రాలతో మళ్ళీ తన రేంజ్ కం బ్యాక్ హిట్ అందుకోవాలని అందరు ఎదురు చూస్తుండగా..
ఇపుడు శంకర్ అయితే రెండు భారీ చిత్రాలు ఒకటి ఉలగనయగన్ కమల్ హాసన్ తో మరొక చిత్రం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో అయితే చేస్తున్నాడు. అయితే ఈ చిత్రాల్లో ఇపుడు శంకర్ మళ్ళీ కమల్ ఇండియన్ 2 లో జాయిన్ కాగా దీనికి అయితే ఈ భారీ చిత్రంలో సరికొత్త టెక్నాలజీ తీసుకొస్తున్నట్టుగా తాను ఓ ఎగ్జైటింగ్ అప్డేట్ ని కూడా అందించారు.
అయితే ఈ చిత్రం విషయంలో ఇంకో సెన్సేషనల్ అప్డేట్ ఇప్పుడు వినిపిస్తుంది. ఈ చిత్రానికి ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు భారీ మొత్తంలో ఆఫర్ ని ఇచ్చినట్టుగా ఇపుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. నెట్ ఫ్లిక్స్ ఈ చిత్రానికి ఏకంగా 220 కోట్ల ఆఫర్ ని జస్ట్ డిజిటల్ హక్కులకు దక్కించుకున్నట్టుగా తెలుస్తుంది.
ఇది మాత్రం రికార్డు మొత్తం అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అయితే అనిరుద్ సంగీతం అందిస్తుండగా కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ లు నటిస్తున్నారు అలాగే సిద్ధార్థ్ కూడా కీలక పాత్ర చేస్తుండగా లైకా ప్రొడక్షన్ బ్యానర్ లో నిర్మాణం వహిస్తున్నారు.