“టైగర్ నాగేశ్వరరావు” రిలీజ్ పై సెన్సేషనల్ బజ్ 

ఇప్పుడు పాన్ ఇండియా సినిమా దగ్గర టాలీవుడ్ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ చిత్రాల్లో మాస్ మహారాజ రవితేజ కూడా నటిస్తున్న చిత్రం “టైగర్ నాగేశ్వరరావు” కూడా ఒకటి. మరి ఈ చిత్రం కోసం అంతా ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తుండగా చిత్ర యూనిట్ ఇది వరకే ఈ సినిమాని ఈ ఏడాది దసరా కానుకగా అయితే ఫిక్స్ చేశారు.

ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రంపై ఇప్పటికే మంచి హైప్ ఉండడంతో దసరా బరిలో భారీ పోటీ ఉంటుంది అని ఫిక్స్ అయ్యింది. కానీ అనూహ్యంగా ఇపుడు టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ డేట్ లో బిగ్ చేంజ్ వచ్చినట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి. కాగా నిన్నటి నుంచి వైరల్ అవుతున్న క్రేజీ అప్డేట్ సలార్ వాయిదా వార్తతో దానిని టైగర్ నాగేశ్వరరావు యూనిట్ కాష్ చేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

అంటే సలార్ వాయిదా పడిన తేదీ సెప్టెంబర్ 28 సమయానికే ఆ తర్వాత రోజు సెప్టెంబర్ 29న తమ సినిమా తీసుకు రావాలని చూస్తున్నారట. అంటే మూడు వారాల ముందే టైగర్ నాగేశ్వరరావు వచ్చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. మరి దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉండగా వస్తే మాస్ మహారాజ్ చిత్రానికి ఇది బిగ్ ప్లస్ అని చెప్పొచ్చు.

పాన్ ఇండియా వైడ్ మరీ అంత గట్టి పోటీ లేకుండా మంచి వసూళ్లు ఈ సినిమా చేసుకునే అవకాశం అప్పుడు ఉంది. మరి ఫైనల్ గా అయితే రిలీజ్ ఎప్పుడు ఉంటుంది అనేది కన్ఫర్మ్ కావాల్సి ఉంది. ఇంకా ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ నుపుర్ సనన్ హీరోయిన్ గా నటిస్తుండగా టాలీవుడ్ కి ఈ సినిమాతో ఆమె ఎంట్రీ ఇవ్వబోతుంది అలాగే దర్శకుడు మహేష్ ఈ సినిమాని భారీ స్కేల్ లో తెరకెక్కిస్తున్నాడు.