బాక్సాఫీస్ : సెన్సేషనల్ “ఆనిమల్”..వసూళ్ళలో భారీ జంప్.!

ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో దుమ్ము లేపుతున్న బాలీవుడ్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తో మన తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన భారీ చిత్రం “ఆనిమల్” అనే చెప్పాలి. డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యిన ఈ చిత్రం అన్ని అంచనాలు అందుకొని మొదటి రోజు నుంచే రికార్డు వసూళ్లు అందుకుంది.

అయితే ఈ సినిమా ఇంట్రెస్టింగ్ గా వీక్ డేస్ లోకి వచ్చిన తర్వాత కూడా రికార్డు నంబర్స్ సెట్ చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. మరి ఈ చిత్రం ఇప్పుడు వీకండ్ మొదటి శనివారం వసూళ్లు ఖచ్చితంగా మళ్ళీ పెరుగుతాయి అనుకున్నారు అందరు. మరి ఇప్పుడు అనుకున్నట్టుగానే భారీ జంప్ ని ఈ సినిమా వరల్డ్ వైడ్ గా అందుకుంది.

కాగా ఈ ఒక్క శనివారమే ఈ చిత్రం వరల్డ్ వైడ్ సుమారు 60 కోట్ల మేర వసూలు చేసేసింది. దీనితో ఈ 9 రోజుల్లో ఆనిమల్ సినిమా ఏకంగా 660 కోట్ల మార్క్ ని కొట్టేసింది. ఇక శనివారం వసూళ్లే ఇలా ఉంటే మరో హాలిడే ఆదివారం వసూళ్లు మరో లెవెల్లో ఉంటాయని చెప్పవచ్చు.

దీనితో ఆనిమల్ కేవలం 10 రోజుల్లోనే 700 కోట్ల క్లబ్ లో చేరిపోతుంది అని చెప్పాలి. మొత్తానికి మాత్రం ఆనిమల్ సెన్సేషన్ ఈ లెవెల్లో ఉంటుంది అని చాలా మంది ఊహించి ఉండకపోవచ్చు. కానీ దానిని సందీప్ రెడ్డి వంగ మరియు రణబీర్ కపూర్ లు దద్దరిల్లే లెవెల్లో చూపించారు.