ఓ సీనియర్ హీరోయిన్ పెళ్ళి పీటలెక్కబోతోందిట. తెలుగులో ఒకప్పుడు అగ్ర హీరోయిన్ అనిపించుకుంది. తమిళ సినిమాల్లోనూ తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఓ నటుడితో ఎఫైర్.. అంటూ ప్రచారమూ జరిగింది ఆమె గురించి.
ప్రస్తుతం తెలుగులో ఓ పెద్ద ప్రాజెక్ట్ చేస్తోంది ఆ హీరోయిన్. అన్నట్టు, ఆ మధ్య ఈ హీరోయిన్ పెళ్ళి పీటలదాకా వెళ్ళిందిగానీ, అనివార్య కారణాల వల్ల ఆ పెళ్ళి కార్యరూపం దాల్చలేదు. పెళ్ళికి ముందే, ఆ వ్యవహారం బెడిసికొట్టింది.
సరే, సినీ రంగంలోనే అని కాదు.. ఎక్కడైనా.. ఇలాంటివి మామూలే. సినీ రంగంలోనివారికి సంబంధించి ఇలాంటి పెటాకుల వ్యవహారాలు, బ్రేకప్ వ్యవహారాలకు మీడియా ఫోకస్ ఎక్కువగా వుంటుందనుకోండి.. అది వేరే సంగతి.
కాగా, సదరు హీరోయిన్ ఓ వ్యాపార వేత్తను పెళ్ళాడబోతోందన్నది తాజా ఖబర్. పెళ్ళి ఈ ఏడాదే జరగబోతోందిట. డెస్టినేషన్ వెడ్డింగ్.. అని అంటున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. కోలీవుడ్‌లో మొదలైన గాసిప్స్, ప్రస్తుతం టాలీవుడ్‌లో షికార్లు చేస్తున్నా, ఈ విషయమై సదరు హీరోయిన్ పెదవి విప్పడంలేదట.
గత అనుభవం నేపథ్యంలో, షడెన్ షాక్ ఇవ్వాలనుకుంటోందని ఆ హీరోయిన్ పెళ్ళి వ్యవహారం గురించి చెప్పుకుంటున్నారు. వయసు మీద పడ్డా వన్నె తగ్గని అందం ఆమెది. కెరీర్ అటకెక్కిపోయిందనుకుంటే, పదే పదే బౌన్స్ బ్యాక్ అవుతూ వస్తుండడం ఆమె ప్రత్యేకత.
లేడీ ఓరియెంటెడ్ సినిమాలూ చేసిందామె. ఇంతకీ, ఎవరామె.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్. కొద్ది రోజులాగితే అన్ని వివరాలూ తెలుస్తాయ్. జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అంతే.! అన్నట్టు, ఓ ప్రధాన రాజకీయ పార్టీలో చేరమని ఆమెకు ఆఫర్ కూడా వచ్చిందట. తెలుగునాట కాదు, తమిళనాట.