1000 కంటే ఎక్కువ థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టైన మహేష్ మూవీ ఇదే!

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. మహేష్ బాబు నటించిన చాలా సినిమాలు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చాయి. అయితే మహేష్ బాబు పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయనే సంగతి తెలిసిందే. మహేష్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో పోకిరి, బిజినెస్ మేన్ సినిమాలు తెరకెక్కాయి. పోకిరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

బిజినెస్ మేన్ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నా ఈ సినిమా పోకిరి సినిమా స్థాయిలో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ను సొంతం చేసుకోలేదు. అయితే 1000 కంటే ఎక్కువ థియేటర్లలో విడుదలైన తొలి సినిమా బిజినెస్ మేన్ కావడం గమనార్హం. పోకిరి కాంబినేషన్ రిపీట్ కావడంతో ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. మహేష్ బాబు అభిమానులకు ఈ సినిమా ఎంతగానో నచ్చింది. మహేష్ క్రేజ్ ఈ సినిమాకు ఎంతగానో ప్లస్ అయింది.

సూర్య హీరోగా తెరకెక్కాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల మహేష్ చేతికి చేరింది. ఎంతోమంది హీరోయిన్ల పేర్లను పరిశీలించి కాజల్ అగర్వాల్ ను ఈ సినిమాకు ఫైనల్ చేశారు. చాలా తక్కువ సమయంలోనే ఈ సినిమా షూటింగ్ ను పూరీ జగన్నాథ్ పూర్తి చేశారు. కేవలం నాలుగు నెలల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడం గమనార్హం. ఈ సినిమాలోని సాంగ్స్ సూపర్ హిట్ గా నిలిచాయి.

దూకుడు బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మహేష్ ఈ సినిమాలో నటించడం గమనార్హం. యావరేజ్ టాక్ తో మొదలైన ఈ సినిమా మహేష్ ఎలివేషన్ సీన్ల వల్ల ప్రేక్షకులను ఆకట్టుకుంది. మహేష్ బాబు కెరీర్ లోని బెస్ట్ సినిమాలలో ఈ సినిమా ఒకటిగా నిలిచింది. కామెడీ సన్నివేశాలు తక్కువగా ఉన్నా ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంది. మహేష్ తన నటనతో ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించారు. పూరీ జగన్నాథ్ డైలాగ్స్ ఈ సినిమా సక్సెస్ కావడానికి కారణమయ్యాయి.