‘నాకు కరోనా రాలేదు మొర్రో .. చెప్పేది వినండి ‘ అంటున్న సీనియర్ స్టార్ హీరో!

సెలబ్రిటీలకు ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్లకు ఇప్పుడు కరోనా పుకార్లను ఖండించడమే మెయిన్‌ టార్గెట్‌గా మారింది. సెలబ్రెటీలు ఎవరైనా ఉన్నట్టుండి ఓ నాలుగు రోజులు కనిపించకపోతే వాళ్లు కరోనా బారిన పడ్డారని అందుకే బయటకు రావడం లేదని సోషల్ మీడియాలో కొందరు పనికట్టుకొని ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంతో తనకు కరోనా సోకిందని కొందరు నిర్థారిస్తుంటే, మరికొందరు తను కరోనా బారిన పడలేదని క్లారిటీ ఇచ్చుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో తాను కరోనా బారినపడ్డానంటూ ఇటీవల నెట్టింట్లో వచ్చిన వార్తలపై నటుడు ప్రభు స్పందించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు.

Prabhu Clarifies On Corona Rumours

ప్రముఖ నటుడు శివాజీ గణేషన్‌ జయంతిని పురస్కరించుకుని తమిళనాడు ప్రభుత్వం గురువారం (అక్టోబర్ ‌1) స్మారక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దీనికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే శివాజీ కుమారుడు, నటుడు ప్రభు మాత్రం ఆ కార్యక్రమంలో కనిపించలేదు. దీంతో ఆయన కరోనా బారిన పడ్డారని, ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారని.. అందుకే స్మారక కార్యక్రమానికి హాజరు కాలేదని సోషల్‌మీడియాలో పోస్టులు దర్శనమిచ్చాయి. వీటిపై ప్రభు స్పందిస్తూ.. తనకు కరోనా సోకలేదని, కాలు బెణకడం వల్ల జయంతి వేడుకలకు హాజరుకాలేకపోయానని స్పష్టం చేశారు.

ఈమధ్య చెన్నైలో ఎస్పీ బాలు కన్నుమూశారు. నటుడు విజయ్ కాంత్ కరోనా బారిన పడ్డారు. హీరో విశాల్ కూడా కరోనా నుంచి కోలుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్రభుకు కూడా కరోనా సోకిందని.. వార్తలు రావడంతో తమిళ తంబీలు కలవరానికి గురయ్యారు. అయితే విజయ్‌ కాంత్‌ కోలుకోవడం, ప్రభుకు కరోనా రాలేదని తేలడంతో సినీ అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రభాస్‌ హీరోగా నటించిన సూపర్‌డూపర్‌ మిట్‌ ‘డార్లింగ్‌’ చిత్రంలో ప్రభు నటించారు. ఈ సినిమాలో ఆయన ప్రభాస్‌ తండ్రి పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు.