Home News సర్కారు వారి పాట ప్రొడ్యూసర్ లు మహేశ్ బాబు ఫ్యాన్స్ కి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.

సర్కారు వారి పాట ప్రొడ్యూసర్ లు మహేశ్ బాబు ఫ్యాన్స్ కి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.

సర్కారి వారి పాట సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ సినిమా. మహేష్ తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ – 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పరశురామ్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. కీర్తి సురేష్ .. మహేష్ బాబు కి జంటగా నటిస్తోంది. ఇటీవల రిలీజైన ప్రీలుక్ పోస్టర్ కి మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ నుంచి విశేష మైన స్పందన వస్తోంది. కరోనా క్రైసిస్ వల్ల అమెరికా లో ప్లాన్ చేసిన 45 రోజుల లాంగ్ షెడ్యూల్ ని పోస్ట్ పోన్ చేసి ముందు హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.

Saaho Eyes For Sarkaru Vaari Paata - Tollywood

ఈ షెడ్యూల్ కోసం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ బ్యాక్ సెట్ కూడా నిర్మించారని నెల రోజుల కి పైగా ఆ సెట్ లో సర్కారు వారి పాట షూటింగ్ జరుపుతారని వార్తలు వచ్చాయి. అంతేకాదు ఈ నెలలోనే హైదరాబాద్ లో షూటింగ్ మొదలు పెట్టబోతున్న సర్కారు వారి పాట టీం ముందు టైటిల్ సాంగ్ ని షూట్ చేయాలని సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ సాంగ్ తర్వాత బ్యాంక్ సెట్ లో షూటింగ్ చేస్తారని అన్నారు.

తాజా సమాచారం ప్రకారం.. హైదరాబాద్ షెడ్యూల్ ని దుబాయ్ కి షిఫ్ట్ చేస్తున్నారని తాజాగా వెల్లడించారట. ఈ నెలాఖరు నుంచి దుబాయ్ లో చిత్రీకరణ సాగనుందని లేటెస్ట్ అప్‌డేట్. ఆ తర్వాత హైదరాబాద్ షెడ్యూల్ ప్రారంభిస్తారట. మరి ఇదైనా ఫిక్సైనట్టేనా లేక మళ్ళీ షెడ్యూల్ లో మార్పులుంటాయా అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాని బ్యాకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్థిక కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కించబోతున్నాడు పరశురాం. థమన్ ఇప్పటికే ట్యూన్స్ రెడీ చేస్తున్నారు.

- Advertisement -

Related Posts

టీడీపీ పుర‌పాలక ఎన్నిక‌ల మేనిఫెస్టోను విడుద‌ల !

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పుర‌పాలక ఎన్నిక‌లకు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతోన్న నేప‌థ్యంలో టీడీపీ ఎన్నిక‌ల మేనిఫెస్టోను విడుద‌ల చేసింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మేనిఫెస్టోను విడుదల చేశారు. మంగ‌ళ‌గిరిలోని టీడీపీ...

ఆ కీలక నేతకు పిలిచి పదవి… ‘బాలయ్య’కి జగన్ ఊహించని షాక్ !

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి టీడీపీ నేత , హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఊహించని షాక్ ఇచ్చాడు. హిందూపురం లో బాలయ్యకి ఝలక్ ఇచ్చిన మహ్మద్ ఇక్బాల్ కి సీఎం...

మ‌రోసారి వార్త‌ల‌లోకి న‌య‌న‌తార పెళ్ళి.. మార్చిలో వివాహం అంటూ ప్ర‌చారం

ద‌క్షిణాది స్టార్ హీరోయిన్స్‌లో న‌య‌న‌తార రూటే స‌ప‌రేట్‌. ఇద్ద‌రితో పీక‌ల్లోతు ప్రేమ‌లో ప‌డిన ఈ ముద్దుగుమ్మ చివ‌ర‌కు ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్‌తో సెటిల్ అయింది. 2015లో విఘ్నేశ్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ‘నానుం...

వలసదారులకి గుడ్ న్యూస్ చెప్పిన జో బైడెన్ .. ఏమిటంటే ?

అమెరికా అధ్య‌క్షుడిగా ఉన్న స‌మ‌యంలో డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న అనేకానేక వివాదాస్ప‌ద‌ నిర్ణ‌యాల‌ను ఒక్కొక్క‌టిగా కొలిక్కి తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు ప్ర‌స్తుత అధ్య‌క్షుడు జో బైడెన్‌. అమెరికన్ల ఉద్యోగావకాశాలపై ప్రభావం చూపిస్తుందనే కారణంతో...

Latest News