“స్పిరిట్” నిడివి కూడా చెప్పేసిన వంగ..!

ఇప్పుడు పాన్ ఇండియా సినిమా ఆడియెన్స్ లో గట్టిగా వినిపిస్తున్న సినిమా పేరు “ఆనిమల్” అయితే దర్శకుడు పేరు మాత్రం ఆ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అని చెప్పవచ్చు. సందీప్ ఇప్పటివరకు చేసింది మూడు సినిమాలే అయినప్పటికీ ఇండియా సినిమా దగ్గర తాను కలిగించిన ఇంపాక్ట్ మాత్రం గట్టిగా ఉంది.

దీనితో తన తదుపరి సినిమాలపై మరిన్ని అంచనాలు నెలకొనగా ఆ చిత్రాల్లో పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో “స్పిరిట్” అనే సెన్సేషనల్ ప్రాజెక్ట్ చేస్తుండగా ఈ సినిమా విషయంలో ఇప్పుడు మరింత ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే జస్ట్ ఈ రెండు రోజుల్లోనే ఈ చిత్రం విషయంలో చాలానే కొత్త డీటెయిల్స్ బయటకి వచ్చేసాయి.

కాగా సందీప్ సినిమాల విషయంలో ఓ కంప్లైంట్ అయితే ఉంది. రన్ టైం ఎక్కువ ఉంటుంది అని ఇప్పుడు వస్తున్నా ఆనిమల్ కి ఏకంగా 3 గంటల 21 నిమిషాలు అంటే అంతా షాక్ అవుతున్నారు. అలాగే స్పిరిట్ కు కూడా మూడు గంటలు దాటి ఉంటుందా అంటే దానిపై సమాచారం తాను ముందే ఇచ్చేసాడు.

దీనితో స్పిరిట్ కి అంత పెద్ద రన్ టైం ఉండదు అని కేవలం 2 గంటల 45 నిముషాలు మూడు గంటల్లోపే సినిమా కట్ చేస్తామని ముందే క్లారిటీ ఇచ్చేసాడు. ఇక దీనితో పాటుగా ఈ చిత్రం సింగిల్ పార్ట్ గా వస్తుండగా 2025 చివరలో కానీ 2026 సంక్రాంతి రేస్ లో గాని రిలీజ్ చేస్తున్నట్టుగా కూడా చెప్పేసాడు. దీనితో ఈ క్రేజీ అప్డేట్స్ వైరల్ గా మారాయి.