Spirit: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి మనందరికీ తెలిసిందే. డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు. ప్రస్తుతం చేతినిండా అరడజన్ కు పైగా పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు ప్రభాస్. ఇకపోతే ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమాలలో స్పిరిట్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు డార్లింగ్ ఫాన్స్. ఇది ఇలా ఉంటే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తాజాగా స్పిరిట్ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే 70 శాతం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పూర్తి చేశాము. గతంలో యానిమల్ సినిమా సమయంలో కూడా షూటింగ్ కంటే ముందే 80శాతం బీజీఎమ్ వర్క్ పూర్తి చేసి ఆ తర్వాతే సెట్స్ మీదికి వెళ్లాము.
ఇలా చేయడంలో వల్ల సీన్ ఎలాంటి ఔట్‌పుట్ వస్తుందో తెలిసిపోతుంది. ఆపై సమయంతో పాటు ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా తగ్గుతుంది. ప్రభాస్ తో నాకు చాలా సన్నిహితం ఉంది. నేను ఊహించిన దానికంటే చాలా ఎక్కువగానే ఈ సినిమాకు సహకరించారు. పాన్ ఇండియా రేంజ్ హీరో అనే ఫీలింగ్ ఆయనలో కనిపించదు. త్వరలో ప్రభాస్ తో కలిసే వస్తాం అని సందీప్ రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. కాగా ఈ చిత్ర కథలో ఫ్లాష్‌బ్యాక్ ఉందట. ఈ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ మాఫియా నేపథ్యంలో ఉంటుందని, ఆ సన్నివేశాల్లో ప్రభాస్ మాఫియా డాన్‌లా కనిపిస్తారని సమాచారం.
Spirit: ప్రభాస్ స్పిరిట్ సినిమా గురించి షాకింగ్ అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి.. 70 శాతం పూర్తి అయ్యిందంటూ!
