కిరాక్ పార్టీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను దోచేసింది సంయుక్త హెగ్డే. ఆ ఒక్క సినిమాతోనే టాలీవుడ్‌ను కట్టిపడేసింది. అయితే సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆమెను ఎవ్వరూ అంతగా పట్టించుకోలేదు. అయితే ఈ మధ్య సంయుక్త హెగ్డే జాతీయ స్థాయిలో వైరల్ అయింది. ఈమె దెబ్బకు నేషనల్ మీడియా కూడా ఉలిక్కి పడింది. పార్కులో వర్కౌట్లు చేస్తుంటే తమపై దాడి చేశారని వీడియో చేయడం లైవ్‌లోనే తన పైనున్న టీ షర్ట్ చూపించడం అన్నీ తెగ వైరల్ అయ్యాయి.
పార్కులో తన స్నేహితురాల్లతో రింగులతో వర్కౌట్లు చేసుకుంటుండగా.. ఓ లేడీ (సరితా రెడ్డి) వచ్చి కొట్టింది, దూషించిందని సంయుక్త హెగ్డే తెలిపింది. స్పోర్ట్స్ డ్రెస్ వేసుకుని వర్కౌట్లు చేసుకుంటుంటే చాలా నీచంగా మాట్లాడిందని వాపోయింది. ఇక ఈ వీడియో జాతీయ స్థాయిలో వైరల్ అవ్వడం, మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కావడం జరిగింది. ఫిర్యాదులు, సోషల్ మీడియా సెటైర్లు వేయడం లాంటివెన్నో జరిగాయి. చివరకు సదరు మహిళ సంయుక్తకు సారీ కూడా చెప్పింది.
తాజాగా ఈ సంయుక్త హెగ్డే ఇంట్లోనే వర్కౌట్లు చేస్తోంది. మధ్యలో తన అమ్మ, అమ్మమ్మలతో కూడా చేయిస్తోంది. రింగుతో విన్యాసాలు చేస్తూ ఉంటే సంయుక్త ఇంకా ఏదో ట్రై చేస్తోన్నట్టు కనిపిస్తోంది. తాజాగా సంయుక్త రింగులతో ఫీట్స్ చేస్తూ.. రెండు కాళ్లను స్ట్రెచింగ్ చేసి అమాంతం నేలమీద కూర్చుంది. మళ్లీ అలాగే లేచి రింగుతో విన్యాసాలు చేసింది. అలా సంయుక్త చేసిన విన్యాసాలను చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. కొంపదీసి మన దేశం తరుపున ఆటల పోటీల్లో పాల్గొనబోతోందా? అని అనుకుంటున్నారు.