ఢిల్లీలో స్కిల్ డెవలప్‌మెంట్ రగడ.! ఫ్లాప్ షో.!

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం వ్యవహారంలో చంద్రబాబు అరెస్టయ్యి జైలుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఏపీ సీఐడీ కావచ్చు.. అదనపు అడ్వకేట్ జనరల్ కావచ్చు.. మీడియా ముందుకొచ్చి తడబడుతున్నారు.

కోర్టులో సీఐడీ కావచ్చు.. ఏఐజీ కావచ్చు.. సమర్ధవంతమైన వాదనలు వినిపించడం వల్లే చంద్రబాబు రిమాండ్ తప్పించుకోలేకపోయారు. కానీ, మీడియా ముందుకొచ్చి అటు సీఐడీ, ఇటు ఏఐజీ అబాసుపాలైపోతున్నారు.

గోదావరి ఎక్కడ పుట్టిందో తెలీదు, గంగా నది ఎక్కడ పుట్టిందో తెలీదు.. కృష్ణా నది ఎక్కడ పుట్టిందో తెలీదు. వీళ్లా సీఐడీ అదికారులు.. అడ్వకేట్ జనరల్లు.. ? అని జనం ముక్కు మీద వేలేసుకుంటున్నారు. పైగా పస లేని వాదనతో ఢిల్లీకి వెళ్లింది ఏపీ సీఐడీ.

సీఐడీకి తోడుగా ఏఐజీ కూడా వెళ్లారు. అక్కడి నేషనల్ మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఏపీ సీఐడీ చేతులెత్తేసింది. ఇదేం పద్ధతి.? ఇంత డిజాస్టర్స్ రాజకీయం ఏపీ సీఐడీ, ఏఐజీ చేయడం.. వైసీపీ శ్రేణులకే నచ్చడం లేదు.

ఈ కేసు నిలబడేది కాదు.. అని చంద్రబాబు అండ్ టీమ్ వాదిస్తున్నదే నిజమయ్యేలా వుంది. దేశం ఇలాంటి కేసుల్ని ఎన్నో చూసింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అసలు డబ్బులు ఎటు పోయాయ్.? అంతిమ లబ్ధిదారు ఎవరు.? అనేది తేల్చలేకపోతే అంతే సంగతి.

నేషనల్ మీడియా ఈ రోజు, ఏపీ సీఐడీనీ, అదనపు అడ్వకేట్ జనరల్‌నీ ప్రశ్నల వర్షంతో ఇరకాటంలో పెట్టిన వైనం ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ నచ్చలేదట.