లోకేష్ ఢిల్లీ టూరు… ఆయాసమే మిగిలింది?

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయలో ఈ విషయమై నారా లోకేష్ హస్తిన ప్రయాణమై వెళ్లారు. జాతీయ మీడియా సాయంతో మొత్తం రాజకీయాన్ని కదిలించాలని భావించినట్లు కనిపిస్తున్నారు.

అయితే… నారా లోకేష్ హస్తిన టూర్ వల్ల నో యూజ్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. లోకేష్ నాలుగైదు రోజుల పాటు చేసిన ఢిల్లీ టూర్ వల్ల ఆయాసమే మిగిలింది తప్ప వనగూరింది ఏమీ లేదనే మాటలు వినిపిస్తున్నాయి. జాతీయ మీడియా అడిగిన ప్రశ్నలతో లోకేష్ ఇబ్బంది పడ్డారని అంటున్నారు పరిశీలకులు.

ఇదే సమయంలో చంద్రబాబుకు ఆశించిన స్థాయిలో జాతీయ స్థాయి నేతల మద్దతు కూడా కరవు అయింది అంటున్నారు. ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో లోకేష్ భేటీ కోసం అపాయింట్మెంట్ ని అడిగారని చెబుతున్నారు. అయితే టీడీపీ విషయంలో ప్రస్తుతానికి హస్తిన లోని బీజేపీ నేతలు అంటీముట్టనట్లే వ్యవహరిస్తున్నారని తెలుస్తుంది.

మరోపక్క చంద్రబాబు అరెస్ట్ మీద పార్లమెంట్ లో టీడీపీ ఎంపీలు కాస్త గట్టి గానే అడిగారు. అయితే అంతకంటే గట్టిగా వైసీపీ ఎంపీల నుంచి కూడా రిప్లై వచ్చింది! మరో వైపు చూస్తే పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీలతో సీనియర్ నేతలతో కలసి లోకేష్ ధర్నా కార్యక్రం కొంతసేపు నిర్వహించగలిగారు.

ఇది మినహా… ఢిల్లీ టూర్ వల్ల ఒరిగిందేమీ లేదనే మాటలు వినిపిస్తున్నాయి. దీంతో లోకేష్ హస్తిన టూర్ వల్ల ఆయాసమే మిగిలిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఆ సంగతి అలా ఉంటే… చంద్రబాబు బెయిల్ పిటిషన్ మంగళవారాం కోర్టు ముందుకు విచారణకు వస్తోంది. చంద్రబాబుకు కోర్టు బెయిల్ ఇస్తే ఓకే.. కానీ అలా రాకపోతే మాత్రం లోకేష్ – టీడీపీ ఏమి చేయబోతారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.