అందం, అభినయంతో పాటు మంచి మానవత్వం ఉన్న అందాల నటి సమంత. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిన సమంత ఎప్పుడు సరదాగా, సంతోషంగా కనిపిస్తుంది. ఏమాయ చేశావే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు మెల్లమెల్లగా ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు వెళ్ళింది. తెలుగుతో పాటు పలు తమిళ సినిమాలలో నటించిన సామ్ అక్కడ కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పెళ్ళి తర్వాత కూడా సమంత వరుస సినిమాలతో దూసుకెళుతుంది. రీసెంట్‌గా ఫ్యామిలీ మెన్ 2 అనే వెబ్ సిరీస్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సామ్ రీసెంట్‌గా హోస్ట్‌గాను అదరగొట్టింది. మామకు తగ్గ కోడలు అని నిరూపించింది. సినిమాల తాలూకు విజయాలు, వాటి కోసం పడిన కష్టం సమంతలో ఎంతో స్పూర్తిని నింపగా, జీవితాన్ని ఆనందమయంగా తీర్చిదిద్దుకునేందుకు లాక్‌డౌన్ లో కొత్త ప్రయోగాలు చేసింది. ఇంటి దగ్గరే సేంద్రియ వ్యవసాయం చేస్తూ అందరిలో స్పూర్తిని కలిగించింది. ఇక రీసెంట్‌గా హీరో రామ్ చరణ్ సతీమణి, అపోలో సంస్థ వైస్ చైర్మన్ ఉపాసన కొణిదెలతో కలిసి ‘యూ ఆర్ లైఫ్’ అనే వెబ్‌సైట్‌ను నిర్వహిస్తుంది.ఈ వెబ్‌సైట్‌కు అతిథి సంపాదకురాలిగా స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని ఉన్నారు. URLife.co.in వెబ్ సైట్ ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేశం ముఖ్యంగా ప్రకృతి అనుకూలమైన జీవనం, సంపూర్ణ ఆరోగ్యం వంటి కొన్ని ప్రత్యేకమైన సిద్ధాంతాలను ప్రజలకు చేరువ చేయడమే అని అంటున్నారు.
మొదటి నుండి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సమంత అనేక విషయాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటుంది. తాను చేసే సేవా కార్యక్రమాలు, సినిమా అప్‌డేట్స్, ఫోటో షూట్స్, టూర్స్ ఇలా తదితర అంశాలకి సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తూ నెటిజన్స్ కు థ్రిల్ కలిగిస్తుంటుంది. రాను రాను సోషల్ మీడియాలో ఫాలోవర్స్‌ను పెంచుకుంటూ వస్తున్న సమంతకు తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల సంఖ్య 13 మిలియన్ల (1.30 కోట్లు)కు చేరింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో అందమైన ఫోటో షేర్ చేస్తూ పేర్కొంది.