Shruthi Hasan: మొదలైన NBK సందడి…: ఒక్క పోస్ట్‌తో ఫాలోవర్స్‌ను తనవైపు తిప్పుకున్న శృతిహాసన్

Shruthi Hasan: గతేడాది బోయపాటి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ’ ఎంతటి భారీ సక్సెస్‌ను అందుకుందో అందరికీ తెలిసిందే. బాక్సాపీస్‌ను బద్దలుకొట్టి కలెక్షన్లతో అదరిగొట్టింది. కరోనా తర్వాత థియేటర్లకు ప్రజలు వస్తారా, లేదా అన్న సందిగ్ధంలో ఉన్న టాలీవుడ్ ఇండస్ట్రీకి ఈ సినిమాకు భారీ ఊరటనిచ్చింది. మళ్లీ తెలుగు సినిమాకు ఊతం లభించినట్టయింది. ఆ ధైర్యంతోనే మిగతా సినిమాలు కూడా ఒక్కోక్కటిగా విడుదల కావడం ప్రారంభమయ్యాయి. అంతేకాకుండా ఈ సినిమా 20థియేటర్స్‌లో 100 రోజులు పూర్తి చేసుకుని ఈ డిజిటల్ యుగంలో వంద రోజుల పోస్టర్‌తో సంచలనం రేపింది.

ఇదిలా ఉండగా కెరీర్ ప్రారంభంలో కొంత మంది హీరోయిన్లు పలానా హీరోతో మాత్రమే చేయాలని అనుకుంటారు. మరికొందరేమో వచ్చిన ప్రతీ అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటారు. అయితే అఖండ చిత్రం తర్వాత బాలయ్య విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. కొంతమంది హీరోయిన్లు అతనితో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారట. వయసుతో తేడా లేకుండా ఆయన పక్కన నటిస్తే చాలు అనుకునే వాళ్లు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అయితే బోయపాటి చిత్రం తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన బాలకృష్ణ, తన తదుపరి చిత్రాన్ని గోపిచంద్ మలినేనితో తీయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఇక ఆ సినిమాలో హీరోయిన్‌గా శృతిహాసన్ చేస్తున్న విషయం కూడా తెలిసిందే.

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శృతి హాసన్ తన తాజా అప్‌డేట్‌లతో పాటు, కొన్ని సార్లు తన అందమైన పిక్‌లను అప్‌లోడ్ చేస్తూ అందర్నీ ఆకర్షిస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఆమె తాజాగా చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. తాను బాలకృష్ణతో కలిసి నటించబోయే NBK 107 సినిమా హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఆమె కూడా ఇటీవలే ఆ షూటింగ్‌లో జాయిన్‌ అయ్యానంటూ ఆమె చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది.