God Father : సినిమా నుండి తప్పుకుంటానన్న సల్మాన్ అసలేం జరిగింది..?

God Father : సల్మాన్ ఖాన్ కు తొలి నుడి సౌత్ హీరోలతో సాన్నిహిత్యం ఉంది. బాలీవుడ్ హీరోలతోనే కాకుండా టాలీవుడ్ హీరోలతో కూడా మంచి సంబంధాలను పెట్టుకున్నాడు సల్మాన్. ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ కు ఫ్రెండ్లీ భాయ్ అన్న పేరుంది. తను నా అనుకున్న వాళ్లు ఎవరడిగినా సపోర్ట్ ఇస్తాడు. అందుకే చిరంజీవి కోసం కాల్షీట్స్ ఇచ్చాడు.. అటు రూపాయి తీసుకోకుండా షారుఖ్ ఖాన్ పఠాన్ కోసం స్పెషల్ రోల్ చేశాడు. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దాలో నటించాడు. ఆ మధ్య ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ కోసం స్టెప్పులేశాడు. ఈమధ్యే అజయ్ దేవగన్ సినిమాను ప్రమోట్ చేశాడు. ఇలా ఎవరడిగినా కాదనకుండా అందరివాడు అనిపించుకుంటున్నాడు సల్మాన్ ఖాన్.

ఇక టాలీవుడ్ లో చిరంజీవి తో కలిసి గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం చిరంజీవినే ముంబై కూడా వెళ్లారు.అక్కడే ముంబై సెట్లలో గాడ్ ఫాదర్ షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ చివరిదశలో ఉండగా ఇపుడు ఒక వార్త హల్ చల్ చేస్తోంది.ముంబై నుంచి తిరిగొచ్చారు మెగాస్టార్ చిరంజీవి. అక్కడ సల్మాన్ ఖాన్ తో గాడ్ ఫాదర్ కాంబినేషన్ సీన్స్ పూర్తి చేశారు. అయితే హైదరాబాద్ కి మాత్రం బరువైన గుండెతో తిరిగొచ్చారు. సల్మాన్ ట్రీట్ మెంట్ కి.. పెట్టిన స్వీట్ కండీషన్ కి మెగాస్టార్ ఫిదా అయ్యారు. అవును గాడ్ ఫాదర్ లో నటించినందుకు గానూ భారీగా ఆఫర్ చేసిన రెమ్యునరేషన్ ను నిర్మొహమాటంగా సల్లూభాయ్ వద్దనేశాడు.

గాడ్‌ ఫాదర్‌ రెమ్యునరేషన్‌ విషయంలో సల్మాన్ నే నిర్మాతలు డెసిషన్ అడిగారు. ఎంత తీసుకున్నా పర్వాలేదన్నారు. అయితే సల్మాన్ ఒక్క పైసా వద్దని చెప్పినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని మేకర్స్‌ చిరు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన నేరుగా సల్మాన్‌ ని అడిగితే.. అసలు తనకు ఎలాంటి రెమ్యునరేషన్ వద్దని, మీతో నటించడమే అత్యంత గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడు. అయినా చిరు పట్టుబట్టడంతో.. తనని బలవంతం చేస్తే మూవీ నుంచి తప్పుకుంటానని సల్లూభాయ్ హెచ్చరించినట్టు చెప్తున్నారు.