స్టార్ హీరో పెళ్లి వేడుక.. మాజీ లవ్ బర్డ్స్ కు స్పెషల్ ఇన్విటేషన్

బాలీవుడ్ లో త్వరలో ఒక యువ హీరో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ కమర్షియల్ హిందీ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్స్ అందుకుంటున్న వరుణ్ ధావన్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తమ చిరకాల ప్రేయసితో అనుకున్నట్లుగానే పెళ్లిని స్పెషల్ గా చేసుకోవడానికి రెడీ అయ్యాడు.

నటాషా దలాల్‌తో గత కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్న ఈ హీరో ఫైనల్ గా ఈ నెల 24న ముంబైలోని అలీబాగ్‌లో లో పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం సెట్ చేసుకున్నాడు. కోవిడ్ -19 పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని కేవలం 50 మంది అతిథుల సమక్షంలోనే వీరి వివాహ వేడుక జరుగుతుందని సమాచారం. అయితే పెళ్లి వేడుకకు మాజీ లవ్ బర్డ్స్ స్పెషల్ గెస్టులుగా రానున్నట్లు సమాచారం.

సల్మాన్ ఖాన్ అలాగే అతని మాజీ గర్ల్ ఫ్రెండ్ కత్రినా కైఫ్ పెళ్లి వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్ నిలవనున్నట్లు తెలుస్తోంది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో వీరికి క్లోజ్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి వారందరి కోసం జనవరి 26న ఈ జంట గ్రాండ్ రిసెప్షన్ పార్టీని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇక పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ అలాగే అతని సోదరుడు రోహిత్ ధావన్ దగ్గరుండి చూసుకుంటున్నట్లు సమాచారం.