ప్రేమతోనే సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో నటించారు.. మెగాస్టార్ కామెంట్స్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం గాడ్ ఫాదర్.మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయినటువంటి లూసీ ఫర్ చిత్రానికి రీమేక్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మెగాస్టార్ చిరంజీవిని శ్రీముఖి ఇంటర్వ్యూ చేసిన విషయం మనకు తెలిసిందే.

ఈ ఇంటర్వ్యూ ఎంతో విభిన్నంగా చేశారు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి శ్రీముఖి విమానంలో ప్రయాణం చేస్తూ ఈ సినిమా కోసం చిరంజీవిని ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో భాగంగా శ్రీముఖి మెగాస్టార్ చిరంజీవిని ఎన్నో ప్రశ్నలు అడిగారు. ఇకపోతే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన విషయం మనకు తెలిసిందే ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ సల్మాన్ ఖాన్ ఈ సినిమాపై ప్రేమతోనే నటించారు థాంక్యూ సో మచ్ సల్లు భాయ్ అంటూ చిరంజీవి సల్మాన్ ఖాన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇక ఈ సినిమాలో పూరి జగన్నాథ్ కూడా కనిపించనున్నారు. ఇందులో ఈయన జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నారు. పూరి జగన్నాథ చస్తే ఈ పాత్రలో చేయనన్నాడు అంటూ ఈ సందర్భంగా చిరంజీవి పూరి జగన్నాథ్ పాత్ర గురించి తెలిపారు. ఇకపోతే ఈ సినిమాకు సంగీతం అందించిన తమన్ ఆరో ప్రాణమని,తమన్ ఈ సినిమాకు ఎంతో అద్భుతమైన సంగీతం సమకూర్చారు అంటూ ఈ సందర్భంగా చిత్ర బృందం గురించి ఈ సినిమా గురించి మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.