సలార్ టీజర్.. డైరెక్టర్ ప్లాన్ వేశాడు కానీ..?

ప్రభాస్ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ ‘సలార్’ కోసం సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. KGF మేకర్స్ తో కలిసి ప్రశాంత్ నీల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరపైకి ఈ సినిమాను తీసుకువస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ ప్రమోషన్స్ అయితే ఇంకా మొదలవలేదు. సినిమాను సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేయాలని అనుకుంటున్న విషయం తెలిసిందే.

ఇక అప్డేట్స్ రావాలి అంటే ముందుగా ఆదిపురుష్ సినిమా హడావిడి ఫినిష్ అవ్వాలి. ఈ సినిమా జూన్ 16వ తేదీన రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరొక టాక్ వైరల్ గా మారుతుంది. ఈ టీజర్ ను ఆదిపురుష్ సినిమా రిలీజ్ సమయంలో బిగ్ స్క్రీన్ పై విడుదల చేయాలనే ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం దర్శకుడు టీజర్ కట్ చేయాల వద్దా అనే ఆలోచనలో ఉన్నాడు. ఇక ప్రభాస్ తో త్వరలోనే చర్చించి ఈ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందట. ఒకవేళ టీజర్ ఆదిపురుష్ తో వస్తే కనుక ఆ సినిమాకు కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది.

మరి ప్రభాస్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. మరోవైపు ప్రభాస్ ప్రాజెక్ట్ K సంక్రాంతికి రానుండగా దాని అప్డేట్స్ కూడా ఈ రెండు సినిమాల రిలీజ్ తరువాత ఉండనున్నాయి. ఇక ప్రభాస్ లిస్టులో మారుతి సినిమాతో పాటు సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్టులు ఉన్న విషయం తెలిసిందే.