ఫైనల్ గా “సలార్ 2” రిలీజ్ పై ఓపెన్ అయ్యిన నిర్మాత..!

ప్యాన్ ఇండియా రెబల్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రమే “సలార్ సీజ్ ఫైర్”. మరి ఈ చిత్రాన్ని దర్శకీడ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు. కాగా కేజీఎఫ్ సినిమాల హైప్ నడుమ అనౌన్స్ అయ్యిన ఈ చిత్రం చాలా మంది తప్పకుండా 1000 కోట్లు కొడుతోంది అని ఆశించారు.

కానీ సినిమా హిట్ టాక్ మాత్రమే తెచ్చుకోవడంతో సుమారు 700 కోట్ల దగ్గరకి వెళ్లి సినిమా ఆగేలా ఉంది. కాగా ఈ చిత్రంకి రెండో భాగం ఉంటుందో లేదో అనేది దర్శకుడు పార్ట్ 1 ప్రమోషన్స్ టైం దాని హిట్ అండ్ రన్ పై డిసైడ్ చేస్తున్నారు అని చెప్పాడు. అయితే ఫైనల్ గా నిన్న స్వయంగా ప్రభాస్ నే పార్ట్ 2 ఉందని కన్ఫర్మ్ చేసేసాడు.

సాధ్యమైనంత త్వరగానే తెస్తామని తాను తెలిపాడు. అయితే ఇప్పుడు అసలు సలార్ 2 రిలీజ్ పై నిర్మాత ఇప్పుడు ఓపెన్ అయ్యారు. నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరగందుర్ పార్ట్ 2 మొదటి దానికన్నా చాలా గ్రాండ్ గా ఉంటుంది అని గేమ్ థ్రోన్స్ టైప్ లోనే ఉంటుంది అని తాను తెలిపాడు అంతే కాకుండా తాము అన్నీ సాధ్యం అయితే సినిమాని మరో 18 నెలల్లో కంప్లీట్ చేస్తామని తాను తెలిపాడు.

దీనితో సలార్ రిలీజ్ ఏకంగా 2025 లో ఉంటుంది అని ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యిపోయింది. సో ప్రభాస్ ఫ్యాన్స్ అప్పుడు వరకు ఆగాల్సిందే అని చెప్పక తప్పదు. కాగా ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా పృథ్వీ రాజ్ సుకుమారన్ విలన్ గా సలార్ శౌర్యంగ పర్వం లో కనిపించనున్నాడు.