‘సలార్’ పోస్ట్ పోన్ అసలు రీజన్ ఇదేనా.?

‘సలార్’ సినిమా సెప్టెంబర్‌లో రిలీజ్ అన్నారు. అయితే, ఇప్పుడది పోస్ట్‌పోన్ అయ్యింది. పోస్ట్‌పోన్‌కి కారణాలు అనేకం అంటున్నారు.

కంప్యూటర్ గ్రాఫిక్స్ ఇంకా పెండింగ్ వుందంటున్నారు. అందుకే ‘సలార్’ అనుకున్న టైమ్‌కి రిలీజ్ చేయలేకపోతున్నారట.

అంతేకాదు, శాటిలైట్ రైట్స్ విషయంలోనూ ఇంకా కొంత గందరగోళం వుందట. శాటిలైట్ రైట్స్ ఇంకా కన్‌ఫామ్ కాలేదంటున్నారు. ఇదీ ఓ రీజనేనట.

మరోవైపు రెమ్యునరేషన్లు కూడా సెట్ కాలేదనే గుస గుస వినిపిస్తోంది. ఇన్ని రీజన్స్ నడుమ ‘సలార్’ రిలీజ్ వాయిదా పడిందంటున్నారు.

కాదు కాదు ఇవేమీ కాదు, ఇంకో కొత్త గాసిప్ తాజాగా చక్కర్లు కొడుతోంది. కొంత పార్ట్ రీషూట్ జరిగిందట. ఈ రీషూట్ పార్ట్‌కి సంబంధించిన టెక్నికల్ వర్క్ పెండింగ్ వల్లే ఈ ఆలస్యం అని ప్రచారం జరుగుతోంది.

ఈ ఈ కారణాల వల్ల నవంబర్‌లో ‘సలార్’ రిలీజ్ వుండొచ్చని అంటున్నారు. కాదు, కాదు డిశంబర్‌లో వుండొచ్చని అంటున్నారు.

కానే కాదు, సంక్రాంతి వరకూ ‘సలార్’ వచ్చేదే లే.! అంటున్నారట. ఏది ఏమైనా ‘సలార్’ విషయంలో ఈ గాసిప్స్.. ఎవరికి తోచిన విధంగా వాళ్లు సర్క్యు‌లేట్ చేస్తున్నారు.

ఏది ఏమైనా రీషూట్ గాసిప్స్ నిజమైతే మాత్రం సంక్రాంతి రిలీజ్ కూడా కష్టమే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్. చూడాలి మరి.