ఈ రంగంలోకి కూడా దిగిన “సలార్” మేకర్స్..!

ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ లో రిలీజ్ కి సిద్ధం కాబోతున్న చిత్రాల్లో బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్ నటించిన డంకి అలాగే సౌత్ నుంచి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం “సలార్” కూడా ఒకటి. మరి ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ రిలీజ్ కి ఇప్పుడు సమయం దగ్గర పడుతుంది.

అయితే ఇంకా కాస్త సమయమే మిగిలి ఉంది కానీ సినిమాలో అసలు ఎన్ని పాటలు ఉన్నాయి. ఒకటైన వస్తుందా లేదాస్ అనే వారికి చిత్ర యూనిట్ ఈరోజు బిగ్ క్లారిటీ ఇచ్చింది. సినిమా ఫస్ట్ సింగిల్ ని అనౌన్స్ చేస్తూ చిత్ర యూనిట్ ఓ అప్డేట్ ని వదిలారు. కాగా ఈ అప్డేట్ తో ఇంకో అనౌన్సమెంట్ కూడా నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ అనౌన్స్ చేయడం ఆసక్తిగానే మారింది.

కాగా సలార్ మ్యూజిక్ ని తమ సొంత మ్యూజిక్ సంస్థ నుంచే రిలీజ్ చేస్తున్నట్టుగా హోంబలే ఫిలిమ్స్ వారు తెలియజేసారు. అయితే సినిమాలకి హోంబలే ఫిలిమ్స్ అయితే మ్యూజిక్ కి హోంబలే మ్యూజిక్ ని అనౌన్స్ చేశారు. ఇది వారికి సరికొత్త మూవ్ అని చెప్పాలి. అయితే వారు ఈ ఒక్క సినిమా సంగీతాన్నే విడుదల చేస్తారా లేక ఇతర సినిమాల మ్యూజిక్ హక్కులు కూడా విడుదల చేస్తారా అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తిగా మారింది.

కాగా సలార్ లో ఒక ఐటెం సాంగ్ ఒక హీరో ఎలివేషన్ సాంగ్ ఉంటాయని ప్రస్తుతానికి కన్ఫర్మ్ అయ్యింది. కేజీఎఫ్ ఫేమ్ రవి బసృర్ మ్యూజిక్ పై చాలా మందికి గట్టి హైప్ ఉంది. మరి సినిమా వాటిని రీచ్ అవుతుందో లేదో సినిమా వరకు ఆగితే తెలిసిపోతుంది.