ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో మంచి క్రేజ్ నడుమ ఎదురు చూస్తున్న భారీ చిత్రం ఏదైనా ఉంది అంటే ఆ సినిమా ఖచ్చితంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన భారీ చిత్రం “సలార్ సీజ్ ఫైర్” అని చెప్పాలి. కన్నడ నుంచి స్టార్ దర్శకుడు కేజీఎఫ్ సినిమాలు ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా కోసం ఎప్పటి నుంచో ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా ఏక్షన్ మూవీ లవర్స్ కూడా చాలా ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు.
మరి ఈ భారీ సినిమా అయితే ఎన్నో వాయిదాలు అనంతరం ఈ ఏడాది డిసెంబర్ 22 కి ఫిక్స్ చేయగా మళ్ళీ ఈ డేట్ నుంచి కూడా చిత్రం తప్పుకుంటుంది అన్నట్టుగా జస్ట్ ఈ రెండు రోజుల్లో కొన్ని వార్తలు అయితే విరివిగా వైరల్ గా మారాయి.
అయితే యూఎస్ మార్కెట్ లో ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్ లు డిసెంబర్ 21 నుంచే ప్రీమియర్స్ పడుతున్నట్టుగా కన్ఫర్మ్ చేసి మళ్ళీ బుకింగ్స్ ఓపెన్ చేయగా తాజాగా సలార్ యూనిట్ కూడా దీనిపై బిగ్ క్లారిటీ అందించారు. కాగా సలార్ ఆన్ టైం వస్తున్నట్టుగా ప్రభాస్ పై జిఫ్ ఒకటి పెట్టి డేట్ కూడా మెన్షన్ చేశారు.
దీనితో సలార్ చిత్రం వాయిదా అని వస్తున్న రూమర్స్ కి చెక్ మేట్ అయితే పెట్టేసారు. సో ప్రభాస్ ఫాన్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ డిసెంబర్ 22 కోసం వెయిట్ చేయొచ్చు అని చెప్పొచ్చు. ఇక ఈ భారీ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా పృథ్వీ రాజ్ సుకుమారన్ జగపతి బాబు అలాగే నటి శ్రీయ రెడ్డి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
https://x.com/SalaarTheSaga/status/1722284427303329888?s=20