‘సలార్‌’ మొదటిరోజు కలెక్షన్స్‌ టాప్‌…!

’సలార్‌’ మొదటి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే, ప్రభాస్‌ బాక్స్‌ ఆఫీస్‌ దగ్గర తన సత్తా మరోసారి చూపించాడు అని అర్థం అవుతోంది. నైజాం కింగ్‌ ఎవరంటే ప్రభాస్‌ అని టక్కున చెప్పేస్తారు, ఆలా వున్నాయి ’సలార్‌’ మొదటి రోజు కలెక్షన్స్‌.

నైజాం ఏరియాలో మొదటి రోజు సలార్‌ రూ.22.55 కోట్ల షేర్‌ కలెక్టు చేసి అల్‌ టైమ్‌ రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో ’ఆర్‌ఆర్‌ఆర్‌’ రూ.23.35 కోట్ల షేర్‌ తో అగ్రస్థానంలో వుంది. అయితే ’ఆర్‌ఆర్‌ఆర్‌’ మల్టీ స్టారర్‌ సినిమా అందులో రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇద్దరు కథానాయకులు, రాజమౌళి దర్శకుడు.

ఈ ’సలార్‌’ సినిమా మొత్తం ప్రభాస్‌ పవర్‌ విూదే నడిచింది, రెండో స్థానంలో నిలిచింది, ప్రభాస్‌ సత్తా ఏంటో తెలిసింది. ఇక రెండు తెలుగు రాష్టాల్ల్రో కలిపి ఈ సినిమా సుమారు రూ.40 కోట్ల షేర్‌ కలెక్టు చేసినట్టుగా ట్రేడ్‌ అనలిస్ట్స్‌ చెపుతున్నారు.

అలాగే ప్రపంచం మొత్తం విూద ఈ సినిమా సుమారు రూ.95 కోట్ల షేర్‌ కలెక్టు చేసి నెంబర్‌ వన్‌ సినిమాగా నిలిచిందని చెపుతున్నారు. గ్రాస్‌ పరంగా చూసుకుంటే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.180 కోట్లు కలెక్టు చేసిందని అంటున్నారు.