ఇపుడు పాన్ ఇండియా మార్కెట్ సహా టాలీవుడ్ మార్కెట్ లో కూడా క్రేజీ అంచనాలు నెలకొల్పుకున్నా బిగ్గెస్ట్ చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం సలార్ సీజ్ ఫైర్ పై ఉన్న అంచనాలే వేరు. మరి ఈ చిత్రం ఇంత క్రేజ్ లో ఉండేసరికి బిజినెస్ కూడా వరల్డ్ వైడ్ గా ఆకాశాన్ని అంటింది.
అయితే ఈ సినిమా విషయంలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి బిజినెస్ డిస్ట్రిబ్యూటర్స్ ని మేకర్స్ లాక్ చేసుకున్నారు. మెయిన్ గా తెలంగాణాలో అయితే మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాని కొనుక్కున్నారు. అయితే ట్రేడ్ సమాచారం ప్రకారం సలార్ కి ఏకంగా మైత్రి సంస్థ వారు ఏకంగా 90 కోట్లు పెట్టి కొన్నారట.
అయితే ఇది చాలా పెద్ద నెంబర్ కానీ సలార్ ప్రొడక్షన్ హౌస్ తో కుదుర్చుకున్న మరో డీల్ తో అయితే ఈ భారీ బిజినెస్ కంప్లీట్ అయ్యిందట. సినిమా బిజినెస్ 90 కోట్లు కాగా అందులో ఫలితం ఏమన్నా తేడా కొడితే అందులో 15 నుంచి 20 కోట్ల మేర రిటర్న్ చేయగలిగే అడ్వాన్స్ తో అయితే డీల్ కుదుర్చుకున్నారట.
అంటే హిట్ అయితే పర్వాలేదు కానీ ప్లాప్ అయితే మాత్రం అప్పటి వరకు వచ్చిన వసూళ్లు పైగా రిటర్నబుల్ అడ్వాన్స్ కూడా ఉంటుంది కాబట్టి మేకర్స్ ఇలా డీల్ కి ఒప్పుకున్నారట. ఇది ఓ సరైన డీల్ అని చెప్పాలి. ప్లాప్ టాక్ వచ్చినా కూడా సలార్ ఈజీగా 40 కోట్లు షేర్ కొట్టేస్తుంది. సో మరీ అంత ఘోరమైన నష్టాలు మైత్రి డిస్ట్రిబ్యూషన్స్ వారికి ఉండకపోవచ్చు.