గత ఏడాది ఇండియా సినిమా దగ్గర వచ్చిన ఎన్నో మాసివ్ ప్రాజెక్ట్ లలో అనౌన్స్ చేసిన నాటి నుంచే క్రేజీ హైప్ తెచ్చుకున్న చిత్రం “సలార్” కూడా ఒకటి. హీరో ప్రభాస్ అలాగే దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసిన నాటి నుంచే పెద్ద ఎత్తున అంచనాలు స్టార్ట్ అయ్యాయి.
కానీ ఆ అంచనాలు మాత్రం సినిమా పూర్తి స్థాయిలో అందుకోలేకపోయింది. రిలీజ్ నాడే టాక్ బాగానే వచ్చింది. కానీ ఎక్కడో ఏదో లోపం ఇప్పుడు సలార్ వసూళ్లపై బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. కాగా ఈ సలార్ సినిమా రిలీజ్ కి ఇంకా సమయం ఉన్న సమయంలో మేకర్స్ చేసిన డల్ థింగ్స్ ఈ సినిమాని నీరు గార్చాయి.
దీనితో మొదటి నాలుగు రోజులు వసూళ్లు బాగానే వచ్చినా తర్వాత మాత్రం బాగా స్లో అయ్యిపోయింది ఈ చిత్రం. ఇక ఈ చిత్రం 400 కోట్లు నుంచి 500 కోట్ల మార్క్ ని అందుకోడానికి నాలుగు రోజులు పడితే ఈ 500 నుంచి ఇంకో 125 కోట్లు అందుకోడానికి ఐదు రోజుల సమయాన్ని సలార్ తీసుకుంది.
దీనితో ఈ చిత్రం కేవలం 7 రోజుల్లో వసూళ్లు చేస్తుంది అనుకున్న 625 కోట్ల గ్రాస్ కి 10 రోజుల సమయం తీసుకుంది. దీనితో సలార్ సినిమా ఎంతలా స్లో అయ్యింది అనేది అర్ధం చేసుకోవచ్చు. ఇక సంక్రాంతి వరకు సలార్ కి సమయం ఉంది కానీ ఈ గ్యాప్ లో ఈ చిత్రం ఎంత రాబడుతుంది అనేది ప్రశ్నగా మారింది.
చాలా మంది అయితే ఇపుడు 1000 కోట్ల మార్క్ పై ఆశలు వదిలేసుకున్నారు. ఇంకా చాలా చోట్ల సినిమా లాభాల బాటలోకి కూడా వెళ్లాల్సి ఉంది. మరి చూడాలి సలార్ ఫైనల్ లెక్కలు ఎలా ఉంటాయో అనేది.