“పుష్ప 2” లో సాయి పల్లవిపై బిగ్ క్లారిటీ.!

Sai pallavi (2)

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇపుడు తన కెరీర్ లో మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా పుష్ప 2 చేస్తున్న సంగతి తెలిసిందే. గత ప్యాండమిక్ టీం లో వచ్చిన పుష్ప 2 తోనే బన్నీ 350 కోట్లకి పైగా వసూళ్లు సెట్ చేసి పెట్టాడు. దీనితో పుష్ప 2 మార్కెట్ ఏకంగా 1000 కోట్లకి చేరింది అని గట్టి టాక్ ఉంది.

కాగా ఇప్పుడు అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉండగా గత కొన్ని రోజులు కితం అయితే ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సాయి పల్లవి కీలక పాత్ర చేస్తుంది అని ఓ సెన్సేషనల్ గాసిప్ వైరల్ గా మారింది. ఆమె ఈ సినిమాలో గిరిజన అమ్మాయిలా కనిపిస్తుంది అని దర్శకుడు సుకుమార్ కీలక పాత్ర డిజైన్ చేసారని కొన్ని వార్తలు వచ్చాయి.

అయితే దీనిపై ఓ తుది క్లారిటీ అయితే వచ్చేసింది. రీసెంట్ గా సాయి పల్లవి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో అయితే మాట్లాడుతూ తాను పుష్ప 2 లో ఉన్నాను అనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని తనకి ఎలాంటి ఆఫర్స్ కానీ ఆ సినిమా యూనిట్ నుంచి కాల్ కానీ రాలేదని తేల్చి చెప్పేసింది.

దీనితో ఈ క్రేజీ న్యూస్ పై ఐతే ఓ బిగ్ క్లారిటీ వచ్చేసినట్టే అని చెప్పాలి. అయితే ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించగా సమంత కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందని ఉందని రూమర్స్ ఉన్నాయి. మరి దీనిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ భారీ సినిమాని మైత్రి మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది వేసవి కానుకగా రిలీజ్ కానున్నట్టుగా బజ్.