లేటెస్ట్ గానే సౌత్ ఇండియా లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్ పై ఓ షాకింగ్ న్యూస్ అయితే సినీ వర్గాల్లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. దీనితో సాయి పల్లవి పర్శనల్ గా స్పందించాల్సి వచ్చింది. అయితే సాయి పల్లవి అంటేనే ఇప్పుడు యూత్ కి గుర్తొచ్చేది తన డాన్స్, ఆ తర్వాత తన క్యూట్ లుక్ మరియు నటనలు కాగా ఇదే డాన్స్ తో సాయి పల్లవి పేరిట తెలుగు సినిమా సహా కోలీవుడ్ లో కూడా భారీ రికార్డులు ఉన్నాయి.
ఎన్నో చార్ట్ బస్టర్ సాంగ్స్ అన్నీ కూడా సాయి పల్లవి పేరు మీదే ఉన్నాయి. హీరో ఎవరైనా కూడా సాలిడ్ గా డామినేట్ చేస్తుంది సాయి పల్లవి మరి అలానే తన కెరీర్ లోనే కాకుండా ఇండియా మ్యూజిక్ లోనే సరికొత్త రికార్డులు సెట్స్ చేసిన సాంగ్ “రౌడీ బేబీ”. తమిళ హీరో ధనుష్ హీరోగా నటించిన “మారి 2” లోని సాంగ్ ఇది కాగా యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.
మరి ఈ సాంగ్ అయితే గ్లోబల్ గా సౌత్ ఇండియా నుంచి మొట్ట మొదటిసారిగా 1 బిలియన్ వ్యూస్ ని నమోదు చేసిన సాంగ్ గా నిలిచింది. దీనితో ఇదే ఓ యూనిక్ అండ్ సెన్సేషనల్ రికార్డు అయితే ఇప్పుడు ఇదే సాంగ్ మరో క్రేజీ రికార్డు అందుకున్నట్టుగా తెలుస్తుంది.
మరి ఈ సాంగ్ 1 బిలియన్ తర్వాత ఇప్పుడు 1.5 బిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి మరో ఊహించని రికార్డు సెట్ చేసింది. దీనితో ఇండియా నుంచి రేర్ రికార్డు కొట్టిన సాంగ్ హీరో అండ్ హీరోయిన్స్ గా సాయి పల్లవి, ధనుష్ లు నిలిచారు.