‘విరూపాక్ష’ సినిమాతో బంపర్ హిట్టు కొట్టేశాడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. ఇంకే ఇతర హీరోకి ఇలాంటి హిట్టు వచ్చినా, అది వేరే లెవల్లో వుండేది.. అంటే, ప్రచారం పరంగా.!
కాసుల కనక వర్షం కురిసేస్తోంది ‘విరూపాక్ష’ సినిమాకి. సినిమా విడుదలయ్యాక పబ్లిసిటీ ఊదరగొట్టేయలేదు. ‘సక్సెస్ అయ్యింది కదా.. సినిమానే మాట్లాడుతుంది..’ అంటూ మౌత్ టాక్కే వదిలేసింది చిత్ర యూనిట్. ఓ మోస్తరుగా పబ్లిసిటీ చేస్తున్నార్లెండి.
ఇంకోపక్క, ఓ ప్రతిష్టాత్మక బ్యానర్ నుంచి భారీ ఆఫర్ సాయి ధరమ్ తేజ్ ముందుకొచ్చిందట. రెమ్యునరేషన్ డబుల్ చేశారట కూడా. కానీ, రెమ్యునరేషన్ విషయంలో సాయి ధరమ్ తేజ్ ‘మరీ అంతొద్దు’ అనేశాడట.
అంతే కాదు, భారీ బడ్జెట్తో సినిమా చేయాలన్న ఆ చిత్ర నిర్మాత ఆలోచన విషయంలోనూ విభేదించాడట. నేలమీదే నడుద్దామని చెప్పాడట. ఎందుకిలా.? గత అనుభవాల నేపథ్యంలోనే కావొచ్చు. మంచి ఆలోచనే కదా.!