Koratala Shiva : కొరటాల కు నచ్చిన సినిమా ఏదో తెలుసా…?

Koratala Shiva : కొరటాల శివ కమర్షియల్ సినిమాకు సందేశాన్ని జోడించి ప్రేక్షకులతో శభాష్ అనిపించుకున్నాడు. మిర్చి అంటూ మాస్ గా వచ్చిన శ్రీమంతుడంటూ డబ్బున్న హీరో సొంతూరిని బాగు చేసిన, పక్కవాడి కష్టం నాదనుకుని పోరాడే వ్యక్తి చెట్లను ప్రేమించే వ్యక్తి గా హీరోను చూపించిన అది కొరటాల కే చెల్లింది. వారంతాల్లో వ్యవసాయం చేయాండంటూ మహర్షి గా హీరో ను చూపించిన అది కొరటాల మార్క్ సినిమా అని చెప్పొచ్చు ఇప్పటివరకు ఓటమి చూడని దర్శకుడు రాజమౌళి అని మాత్రమే తెలుసు. కానీ కొరటాల కూడా ఇప్పటి వరకు ఓటమి చూడలేదు. తన సినిమాతో హీరోకి క్లాస్ టచ్ మాస్ హీరో ఇమేజ్ ను ఇస్తాడు కొరటాల.

ఇక తెలుగు ప్రేక్షకులకు కొరటాల ప్రతి సినిమా నచ్చింది అందుకే ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే మరీ కొరటాలకు నచ్చిన సినిమా ఏది… ఈ ప్రశ్న ఎదురైంది ఇటీవల ఆచార్య ప్రమోషన్స్ లో కొరటాల శివకు ఇక ఈ ప్రశ్న కు కొరటాల టక్కున సమాధానం చెప్పారు. ఇంతకీ కొరటాలకు నచ్చిన సినిమా ఏదో తెలుసా అదే కమల్ హాసన్ నటించిన సాగర సంగమం.

ఇక మరో సినిమా శంకర్ తీసిన భారతీయుడు. ఈ రెండు కమర్షియల్ గాను ఇటు క్లాసిక్ గాను నిలిచిన సినిమాలుగా వర్ణించాడు. అందుకే ఈ సినిమాలు నచ్చుతాయని చెప్పారు. అయిన కొరటాలకు సామాజిక భాద్యత ఎక్కువే. అందుకే తన సినిమాతో అటు కమర్షియల్ విజయాన్ని అందుకుంటూనే ఇటు చూసే ప్రేక్షకుడికి సందేశాన్ని , దేశం మీద బాధ్యతను తెలుపుతున్నాడు. ఇక కొరటాల దర్శకత్వం వహించిన తాజా చిత్రం ఆచార్య విడుదలకు సిద్ధమైంది. ఇక తన తదుపరి చిత్రాన్ని పొలిటికల్ డ్రామాగా ఎన్టీఆర్ తో తీయబోతున్నాడు.