Kangana Ranaut: బాలీవుడ్‌పై మరోసారి విమర్శలు గుప్పించిన కంగనా.. ఆ సర్కిల్స్ నుంచి బయటికి రారు అంటూ!

Kangana Ranaut: తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఎక్కువగా సినిమాల ద్వారా కంటే కాంట్రవర్సీల ద్వారా బాగా హైలెట్ అయింది. తరచూ ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తలు నిలుస్తూ ఉంటుంది కంగనా. సినిమాలకు సంబంధించిన వ్యవహారాల కంటే ఎక్కువగా కాంట్రవర్సీలకు సంబంధించిన వ్యవహారాలతోనే వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అలాగే సమాజంలో ఇండస్ట్రీలో జరిగే పలు అంశాలపై స్పందిస్తూ ఉంటుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది కంగనా. బాలీవుడ్ పై మరోసారి ఈమె విమర్శలు గుప్పించింది. తాజాగా జరిగిన ఒక చర్చ కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది.. ఈ సందర్భంగా కంగనా రనౌత్‌ మాట్లాడుతూ.. బాలీవుడ్‌ ను ప్రధాన సిని పరిశ్రమగా గుర్తించాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. ప్రధాన చిత్ర పరిశ్రమ అని చెప్పడానికి కావాల్సిన ప్రమాణాలు కూడా ఏమీ లేవు. బాలీవుడ్‌ లో ఉండేవాళ్లు ఒక సర్కిల్‌ గీసుకుని అందులోనే ఉంటారు. దాని వల్లే వాళ్లతో నాకు ఎప్పుడూ మాటలు సరిగ్గా ఉండవు. ఆ సర్కిల్‌ నుంచి బయటకు రావాలని వారు ఏమాత్రం కోరుకోరు. ప్రతిరోజూ జిమ్‌ కు వెళ్లడం.. ప్రొటీన్‌ షేక్స్ తాగడం.. ఇంజక్షన్స్‌ తీసుకోవడం.. మాత్రమే వాళ్లకు తెలుసు.

అదే విధంగా సిక్స్‌ ప్యాక్‌, గ్లామర్‌ లుక్స్‌, బీచ్‌లు, బైక్స్‌, ఐటెమ్‌ నంబర్స్‌ ఇవి ఉంటే చాలు వాళ్లకు అంటూ బాలీవుడ్ సెలబ్రిటీలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అనంతరం దక్షిణాది సినీ పరిశ్రమ గురించి మాట్లాడుతూ పొగడ్తల వర్షం కురిపించారు. దక్షిణాది శని పరిశ్రమలో నటీనటులు ఎంతో శ్రమిస్తూ ఉంటారని ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు అంటూ పొగడ్తల వర్షం కురిపించింది కంగనా రనౌత్‌. ఇకపోతే కంగనా బాలీవుడ్ పై ఈ విధంగా విమర్శలు చేయడం అన్నది ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా చాలాసార్లు ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీపై బాలీవుడ్ సెలబ్రిటీలపై సంచలన వాఖ్యలు చేసి వార్తలు నిలిచింది. అయితే తాజాగా మరోసారి బాలీవుడ్ ఇండస్ట్రీపై బాలీవుడ్ సెలబ్రిటీలపై చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. మరి ఈ వ్యాఖ్యలపై సెలబ్రిటీలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.