సింగర్లందరూ అక్కడే చేసే పనులు అవేనా?.. యాంకర్ ప్రదీప్ కూడా జాయిన్ అవుతాడట!

సింగర్ సాకేత్ ఈ మధ్య బాగానే ఫేమస్ అవుతున్నాడు. సరిగమప సింగింగ్ ఐకాన్ పేరిట వస్తోన్న షోలో సాకేత్, రేవంత్, హారిక వంటి వారు మెంటర్లుగా వ్యవహారిస్తున్నారు. కోటి, శైలజ, చంద్రబోస్ వంటి వారు న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు. వచ్చే ఆదివారం నాటి షోలో మెంటర్ల మధ్య పోటీ పెట్టనున్నారు. ఈ క్రమంలో సాకేత్ తండ్రి రామాచారి గురించి ప్రస్థావన వచ్చింది. సంఘసేవకులు చాలా మంది ఉన్నారు.. కానీ సంగీత సేవకులు మాత్రం రామాచారి అంటూ చంద్రబోస్ ప్రశంసల వర్షం కురిపించాడు.

రామాచారి దగ్గర శిష్యులుగా చేరిన చాలా మంది జంటలుగా మారిపోయారట. సింగర్ దీపు కూడా అక్కడే ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట. మొదట సంగీతం నేర్చుకోవడానికే వెళ్లాను కానీ దీపు నాకు సపరేట్ పాఠాలు చెప్పాడని ఆయన శ్రీమతి కామెంట్లు చేసింది. అలా మరో జంట కూడా పెళ్లి పీటల వరకు వెళ్లిందని సాకేత్ చెప్పుకొచ్చాడు. ఇదంతా గమనించిన శైలజ అదిరిపోయే పంచ్ వేసింది. యాంకర్ ప్రదీప్‌ను ఉద్దేశించి వేసిన సెటైర్ బాగానే క్లిక్ అవుతోంది.

Sa Re Ga Ma Pa The Next Singing Icon Sp Sailaja Satires On Anchor Pradeep
SA RE GA MA PA The Next Singing ICON SP Sailaja satires On Anchor Pradeep

మొట్టమొదటిసారిగా ఓ నిర్ణయానికి వచ్చాను.. ఫస్ట్ రామాచారి గారితో మాట్లాడాలి.. రేవంత్ మళ్లీ నువ్ వెళ్లి క్లాసులో జాయిన్ అవ్వు.. నీతో పాటు ప్రదీప్‌ను కూడా తీసుకెళ్లు అంటూ శైలజ సెటైర్ వేసింది. దానికి ప్రదీప్ స్పందిస్తూ.. నా ఆశ కూడా అదే అంటూ ఉత్సాహాన్ని చూపాడు. మొత్తానికి ఈ ప్రోమో మాత్రం ఎన్నో విషయాలను బయటపెట్టేసింది. సంగీతం క్లాసులకు వెళ్లి ప్రేమ పాఠాలు నేర్చుకున్నారు. ప్రోమోనే ఇలా ఉంటే ఎపిసోడ్ మొత్తంగా మెంటర్ల పర్ఫామెన్స్, పర్సనల్ స్టోరీలతో బాగానే క్లిక్ అయ్యేలా కనిపిస్తోంది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles