ఎట్టకేలకు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యాంకర్ ప్రదీప్.. అమ్మాయి ఎవరంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది ఫిమేల్ యాంకర్స్ ఉన్నప్పటికీ మేల్ యాంకర్స్ గా కొంతమంది మాత్రమే గుర్తింపు పొందారు. ఇలా బుల్లితెరపై తన మాటలతో అందరినీ ఆకట్టుకుంటూ యాంకర్ గా గుర్తింపు పొందిన ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ ప్రదీప్ ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ ప్రదీప్ప్రదీప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో యాంకర్ గారు రాణిస్తున్న ప్రదీప్ ఇప్పటికీ తన స్టార్డం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇలా యాంకర్ గా మాత్రమే కాకుండా నటుడిగా కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. ఎన్నో సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రదీప్ 30 రోజులలో ప్రేమించడం ఎలా? అని సినిమాలో హీరోగా కూడా నటించాడు. ఇలా నటుడిగా యాంకర్ గా గుడ్ మంచి గుర్తింపు పొందిన ప్రదీప్ బుల్లితెర మీద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కూడా పాపులర్ అయ్యాడు.

ప్రదీప్ ఎన్నో ఏళ్లుగా యాంకర్ గా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ ప్రదీప్ పెళ్లి గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. అయితే ప్రదీప్ మాత్రం ఏదో ఒక సాకు చెప్పి ఆ టాపిక్ ని డైవర్ట్ చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక ఎప్పటికప్పుడు ప్రదీప్ పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా మరొకసారి ప్రదీప్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకాలం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న ప్రదీప్ ఎట్టకేలకు పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గత 24 గంటలుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ప్రదీప్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి సంబంధించిన వివరాల గురించి కూడా నెటిజన్స్ ఆరా తీస్తున్నారు.

ప్రదీప్ నవ్య అనే ఒక ఫ్యాషన్ డిజైనర్ ని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలకు డిజైనర్ గా పనిచేస్తున్న నవ్య అనే యువతిని డిసెంబర్ నెలలో ప్రదీప్ నిశ్చితార్థం చేసుకోనున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఫిబ్రవరి నెలలో వివాహానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రదీప్ పెళ్లి వార్త వినాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పెళ్లి వార్తలు నిజమా? లేక ఎప్పటిలాగే రేటింగ్స్ కోసం ఇలా పెళ్లి వార్తలు వైరల్ చేస్తున్నారా? అని మరి కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.