యాంకర్ ప్రదీప్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడానికి వాళ్లే కారణమా… వారి వల్లే పెళ్లి జరగబోతోందా?

బుల్లితెర యాంకర్లుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ప్రదీప్ మాచిరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.గడసరి అత్త సొగసరి కోడలు అనే కార్యక్రమం ద్వారా యాంకర్ గా పరిచయమైనటువంటి ప్రదీప్ ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.ఇకపోతే యాంకర్ గా మాత్రమే కాకుండా నిర్మాతగా కొన్ని షోలను కూడా నిర్వహించారు. అదేవిధంగా వెండి తెరపై పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన ప్రదీప్ అనంతరం 30 రోజులలో ప్రేమించడం ఎలా అనే సినిమాకి హీరోగా కూడా నటించారు.

ఈ విధంగా వృత్తిపరమైన జీవితంలో ఎంతో సక్సెస్ అయినటువంటి ప్రదీప్ ప్రస్తుతం మూడు పదుల వయసు దాటుతున్నప్పటికీ ఇంకా పెళ్లి గురించి ఏమాత్రం ఆలోచించలేదు.అయితే ఇప్పటికే ఎన్నోసార్లు ప్రదీప్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇక ఈ వార్తలను ప్రదీప్ చాలా సార్లు కూడా ఖండించారు.ఇకపోతే తాజాగా ఈయన పెళ్లి గురించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈయన ప్రముఖ డిజైనర్ నవ్య మరౌతు అనే డిజైనర్ తో పెళ్లికి సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి.

ఈమె తెలుగు బిగ్ బాస్ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్లకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు. అయితే ఈమెతో ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి.నిప్పు లేనిదే ఒక రాదంటారు అయితే ప్రదీప్ నవ్య రిలేషన్ లో కూడా ఏదో నిజం ఉందని అందుకే ఈ విషయాన్ని ప్రదీప్ కూడా ఏమాత్రం ఖండించలేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే ప్రదీప్ నవ్య ఇద్దరిదీ ఒకే కులం కాదని వీరిద్దరూ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోబోతున్నారని తెలుస్తోంది. అయితే ఇలా వీరిద్దరు పెళ్లి జరగడానికి వారి తల్లిదండ్రులే కారణమని చెప్పాలి. వీరి తల్లిదండ్రులు కులాలకు కాకుండా వీరి ప్రేమను గౌరవించి వీరు పెళ్లికి ఒప్పుకున్నారని సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజము ఉందో తెలియాల్సి ఉంది.