ఆర్ ఆర్ ఆర్ .. దేశ వ్యాప్తంగా వేయి కళ్ళతో ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా. ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్.టి.ఆర్, రాం చరణ్.. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, సీనియర్ హీరో అజయ్ దేవగణ్.. బ్రిటన్ మోడల్ ఓలియా మోరిస్.. శ్రీయా శరణ్.. సముద్ర ఖని … ఇలాంటి భారీ తారాగణం తో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ మీద ఒక్క తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాదు బాలీవుడ్, కోలీవుడ్.. సహా అన్ని చిత్ర పరిశ్రమలు ఎప్పుడెప్పుడు ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ అవుతుందా అని విపరీతమైన ఆతృతగా ఉన్నారు.
కథ ఎలాంటిదైనా భారీ హంగులతో ప్రపంచ స్థాయిలో అందరు శభాష్ అనేలా తెరకెక్కించడం రాజమౌళి ప్రత్యేకత. ఆ విషయం బాహుబలి నిరూపించిన సంగతి తెలిసిందే. బాహుబలి రెండు భాగాలు వండర్ విజువల్ గా హాలీవుడ్ రేంజ్ లో అందరి మన్నలను పొందింది. అంతేకాదు తెలుగు చిత్ర పరిశ్రమ కి ఉన్న గొప్పతనాన్ని చాటి చెప్పింది. బాహుబలి గురించి ఇంత గొప్పగా చెప్పుకోవడానికి కారణం వీఎఫెక్స్ అని అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్న దాని బట్టి ఆర్ ఆర్ ఆర్ వచ్చాక ఇక బాహుబలి సినిమా గురించి వినపడదని తెలుస్తోంది.
అంత గొప్పగా విజువల్ వండర్ ని తయారు చేస్తున్నారట రాజమౌళి. ఆ విషయం ఆర్ ఆర్ ఆర్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన రామరాజు ఫర్ భీం, భీం ఫర్ రామరాజు టీజర్స్ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమలో గ్రాఫిక్స్ అండ్ వీఎఫెక్స్ ఊహించని విధంగా ఉంటాయట. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. కాగా ఆర్ ఆర్ ఆర్ ని ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి 2021 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారట. ఒకవేళ సమ్మర్ కి గనక రిలీజ్ చేయలేకపోతే విజయదశమి పండుగ సందర్భంగా రిలీజ్ చేస్తారని సమాచారం.