RRR: మరో మైలురాయిని చేరుకున్న ఆర్ఆర్ఆర్…సూపర్ స్టార్ సినిమాను వెనక్కినేట్టేసింది…!

RRR : ఆర్ఆర్ఆర్ సినిమా ఇంకా రికార్డుల మోత మొగిస్తూనే ఉంది.ఎన్టీఆర్ తొక్కుకుంటూ పోవాలే అనే డైలాగ్ లాగా మిగిలిన సినిమాలను తొక్కుకుంటూ పోతోంది ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ముందు బాలీవుడ్ సినిమాలైతే నలిగిపోతున్నాయి.

ఉగాది పండగ కలిసి రావడంతో మరింత వసూళ్లతో దూసుకుపోతుంది. ఇద్దరు సూపర్ స్టార్స్ ను రాజమౌళి హ్యాండిల్ చేసిన తీరుకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ వారి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ను ఇచ్చారు. పాన్ ఇండియా సూపర్ స్టార్స్ అయ్యారు.

ఇక ఇపుడు ఆర్ఆర్ఆర్ సినిమా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇండియన్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల్లో ఐదవ స్థానాన్ని తెచ్చుకుంది. అది కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రోబో 2.0 సినిమాను అధిగమించి ఐదవ స్థానం లో నిలబడింది. ఇక మొదటి నాలుగు స్థానాల్లో మొదటి ఐదు స్థానాల్లో దంగల్, బాహుబలి ది కంక్లూజన్, సీక్రెట్ సూపర్ స్టార్, పీకే ఉన్నాయి. ఇక ఇప్పటికే ఆర్ఆర్ఆర్ బాలీవుడ్ లో గంగూభాయి కతియావాడి, ది కాశ్మీర్ ఫైల్స్, బాహుబలి (హిందీ) కలెక్షన్లును అధిగమించింది.