IMDB : ఆర్ఆర్ఆర్ సినిమా రోజుకో రికార్డుతో వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం ఇండియాలో టాప్ 5 సినిమాగా నిలిచినా ఈ సినిమా. ఇపుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమాలకు రేటింగ్స్ ఇచ్చే IMDB సంస్థ టాప్ 5 ప్లేసులో ఆర్ఆర్ఆర్ ను చేర్చింది.సినిమా విడుదలయ్యాక IMDB రేటింగ్స్ లో 9/10 ఇచ్చింది. ఇంత రేటింగ్ తెచ్చుకునే సినిమాలు చాలా అరుదు అయితే ఇటీవల విడుదలైన కాశ్మీర్ ఫైల్స్ కి కూడా IMDB రేటింగ్ దాదాపు గా 9కి దగ్గరగా ఇచ్చింది. ఈ మధ్య మన ఇండియన్ సినిమాల నాణ్యత పెరిగిందనడానికి ఇది నిదర్శనం.
ఇక ఆర్ఆర్ఆర్ అటు ఇండియా లోనూ ఇటు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతోంది.ఆస్ట్రేలియా, అమెరికా, ఆఫ్రికా దేశాలలోనూ సత్తా చాటుతోంది. ఇక నేపాల్ లో అయితే థియేటర్ల వద్ద రచ్చ చేస్తున్నారు ప్రేక్షకులు.ఎన్టీఆర్, రామ్ చరణ్ ల నటనకు రాజమౌళి దర్శకత్వానికి ఫిదా అవుతున్నారు.ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్, రామ్ చరణ్ లు పాన్ ఇండియా సూపర్ స్టార్స్ అయ్యారు ఎపుడు వారికీ బాలీవుడ్ ఆఫర్లు వరుస కడుతున్నాయి.
IMDB రేటింగ్స్ సంస్థ టాప్ 5 లో ఉన్న సినిమాలు వరుసగా సిఓడిఏ 2021,డెత్ అఫ్ ది నైలే 2022,మోర్బీస్ 2022, ది బాట్ మాన్ 2022, ఆర్ఆర్ఆర్ 2022.ఇక తొలి ఇండియన్ సినిమా IMDB రేటింగ్స్ లో టాప్ 5 లో నిలిచినదిగా రికార్డ్ క్రియేట్ చేసింది.అయితే ఇక్కడ ఇంకా విశేషం ఉంది. IMDB టాప్ 4 సినిమాల రేటింగ్స్ ఆర్ఆర్ఆర్ కిచ్చిన రేటింగ్ కన్నా తక్కువే. ఆ సినిమా ల రేటింగ్స్ 7లేదా 9 కి లోపే ఉండటం గమనార్హం.ఇలా దర్శకధీరుడు రాజమౌళి సినిమా ఆర్ఆర్ఆర్ ప్రపంచం వ్యాప్తంగా భారతీయ సినిమా ఖ్యాతిని నిలబెడుతోంది.