Mahavatar Narasimha: ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు చిన్న సినిమాలుగా విడుదల అయ్యి పెద్దపెద్ద విజయాలను సాదిస్తున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ హిట్స్ అందుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. అలా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఒక సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం కోట్లల్లో కలెక్షన్స్ ని సాధిస్తూ దూసుకుపోతోంది. ఆ సినిమా మరేదో కాదు మహావతార్ నరసింహ.
ప్రస్తుతం థియేటర్స్ వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. ప్రేక్షకులు ఈ సినిమా చూడటానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా మహావతార్ నరసింహ సినిమా గురించే మాట్లాడుతున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు మొత్తం మహావతార్ నరసింహ సినిమా వీడియోలే కనిపిస్తున్నాయి. చిన్న పెద్ద అందరూ ఈ సినిమా చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. మహా విష్ణువు దశావతారాల ఆధారంగా పదేళ్లపాటు వరుసగా సినిమాలు రూపొందనున్నాయి.
మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో మేకర్స్ ఏడాదికి ఒక సినిమాను విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా మరో కొత్త రికార్డ్ ని క్రియేట్ చేసింది. దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం ఇండియాలనే కాదు అమెరికాలోనూ ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇప్పటికే అక్కడ 1 మిలియన్ డాలర్స్ కు పైగా కలెక్షన్స్ సాధించిందని తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ సినిమా ఇంకా ఎన్ని రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.
