Khaleja Movie: రీ రిలీజ్ లో రికార్డు బద్దలు కొట్టిన ఖలేజా మూవీ.. సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన మహేష్!

Khaleja Movie: ఇటీవల కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండు బాగా నడుస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు విడుదల అయ్యి మంచి సక్సెస్ అయిన సినిమాలు ఫ్లాప్ అయిన సినిమాలు ఇప్పుడు థియేటర్లలో మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు మూవీ మేకర్స్. అలా ఇప్పటికే చాలా సినిమాలు విడుదల అయిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా టాలీవుడ్ దివంగత హీరో సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మ దినోత్సవం సందర్భంగా మే 30 న ఖలేజా చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రీ రిలీజ్ కు రంగం సిద్దం అయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఖలేజా రీ రిలీజ్ సందర్భంగా ప్రీ సేల్ వేడుక ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో ఖలేజా నిర్మాతలు శింగనమల రమేశ్, సి. కళ్యాణ్, కృష్ణ గారి సోదరులు ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరి రావు, కమెడియన్ అలీ, సునీల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిశేషగిరి రావు గారు మాట్లాడుతూ.. నిర్మాతలు ఇద్దరితో చాలా మంచి అనుబంధం ఉంది. పోకిరి సినిమాతో రీ రిలీజ్ మొదలైంది. ఈ సినిమాను సుబ్బారావు రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. రీరిలీజ్ వలన నిర్మాతలు సంతోషంగా ఉంటున్నారు. ఖలేజాకు మంచి ఆదరణ లభిస్తుంది అని ఆయన తెలిపారు. అనంతరం నిర్మాత సీ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఖలేజా సినిమా రీ రిలీస్ అవుతున్న సందర్భంగా కనకరత్న మూవీస్ తరఫున శుభాకాంక్షలు తెలిపారు.

సినిమా చాలా కష్టపడి తీసినట్లు చెప్పారు. సినిమాలో ప్రతీ సీన్ చాలా అద్భుతంగా ఉంటుందని అన్నారు. సినిమాలో త్రివిక్రమ్, మహేష్ బాబు, నమ్రత అందరూ ఒక టీంలా పనిచేశారని అన్నారు. అలాగే ఇప్పటికి 1500 సార్లు బుల్లి తెరమీద ప్రదర్శించి రికార్డ్ సృష్టించిన సినిమా ఖలేజా అని సీ కళ్యాణ్ చెప్పు కొచ్చారు. మే 30 వ తేదీన థియేటర్ లు బద్దలు అవుతాయి అన్నారు. అలీ మాట్లాడుతూ.. సినిమాను తీయడానికి నిర్మాతలు చాలా కష్టపడ్డారు. ఖలేజా సినిమా టీవీ లలో రికార్డ్ క్రియేట్ చేసింది. ఏ దేశం వెళ్లిన ఖలేజా గురించి మాట్లాడుతారు. సినిమాను త్రివిక్రమ్, మహేష్ బాబు ప్రాణం పెట్టి చేశారు. ఈ సినిమాను రీ రిలీజ్ అనడం కన్నా డైరెక్ట్ రిలీజ్ అంటే బెటర్. సినిమాకు ఇప్పటికి కల్ట్ ఫాన్స్ ఉన్నారు, మే 30 థియేటర్ లో చూద్దాం అని ఆయన అన్నారు. ఏసియన్ సునీల్ నారాయణ మాట్లాడుతూ.. ఈ సినిమా ఫ్రెష్ రిలీజ్ లా ఉందని అన్నారు. ఓపెన్ చేసిన నిమిషాలలోనే టికెట్స్ బుక్ అవడం ఆశ్చర్యంగా ఉందని ఆయన అన్నారు. ఇలా సినిమా ఇంకా రిలీజ్ కాకముందే ఓపెనింగ్ లోనే నిమిషాల వ్యవధిలో టికెట్ బుక్ అవ్వడం అన్నది చాలా అరుదు అని నిర్మాతలు చెప్పుకొచ్చారు.