క్రేజీ : జపాన్లో ఆల్ టైం బిగ్గెస్ట్ డే సెట్ చేసిన “RRR”.!

RRR-1200by667

పాన్ వరల్డ్ సెన్సేషన్ సినిమా అందులోని మన ఇండియన్ సినిమా నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం ఏదైనా ఉంది అంటే అది డెఫినెట్ గా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన మాసివ్ ఎంటర్టైనర్ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) అనే చెప్పాలి.

కాగా ఈ చిత్రంలో రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించగా ఈ సినిమా ఆస్కార్ నెగ్గి సెన్సేషన్ సెట్ చేసింది. కాగా ఈ సినిమా జపాన్ దేశంలో కూడా రిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో రికార్డులు తిరగరాసి ఏకంగా పలు హాలీవుడ్ భారీ హిట్ సినిమాలను కూడా దాటి బిగ్గెస్ట్ రికార్డులు సెట్ చేసిన ఈ చిత్రం ఇపుడు మరో బిగ్గెస్ట్ డే సెట్ చేసిందట.

అక్కడ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి 194 రోజులు కాగా ఈ అన్ని రోజుల్లో అన్ని సోమవారాలు కన్నా 193వ రోజు సోమవారం అన్ని రోజులు కన్నా ఎక్కువ వసూళ్లు రాబట్టినట్టుగా తెలుపుతున్నారు. దీనితో అసలు అక్కడ ఈ సినిమా ఏ స్థాయిలో రన్ అవుతుందో జపాన్ ఆడియెన్స్ ఎలాంటి ప్రేమను చూపిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

ఇప్పటికి అయితే ఈ చిత్రం 1.8 బిలియన్ జపాన్ యెన్స్ దాటేసిందట. ఇక నెక్స్ట్ టార్గెట్ 2 బిలియన్ అని కూడా తెలుస్తుంది. అంతే కాకుండా లేటెస్ట్ గానే గత ఏడాది వచ్చిన హాలీవుడ్ భారీ చిత్రం డాక్టర్ స్ట్రేంజ్ 2 ని కూడా RRR క్రాస్ చేసినట్టుగా తెలుస్తుంది.