RRR: ఆర్ఆర్ఆర్ మిగతా చిత్రాలను మింగేస్తుందా..! విశ్లేషకులు ఏం చెబుతున్నారు..?

RRR:దర్శకధీరుడు రాజమౌళి, ఎన్టీఆర్ ,రామ్ చరణ్ లతో తీసిన సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాను మార్చి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు చిత్రబృందం చాలా చురుగ్గా చేస్తోంది. ప్రమోషన్ లో భాగంగా రాజమౌళి,ఎన్టీఆర్,రామ్ చరణ్ ముగ్గురు ఇంటర్వ్యూ లకు బిజీగా ఉన్నారు.ఆర్ఆర్ఆర్’ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ చేస్తున్నారు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనం సృష్టిస్తుంది అని,మొదటి రోజే ఈ సినిమా ఈజీగా వందకోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకుంటుంది అని కూడా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నారు.

పలుసార్లు వాయిదా పడ్డ ఎట్టకేలకు మార్చి 25న ప్రేక్షకుల ముందుకు భారీ అంచనాల మధ్య రానుంది. కొన్ని రోజుల్లోనే ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. కానీ ఇప్పటికే థియేటర్లలో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్, పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్, రాజ్ తరుణ్ హీరో గా కొత్తగా వచ్చిన స్టాండ్ అప్ రాహుల్ ఇలాంటి సినిమాలు థియేటర్లలోనే ఉన్నాయి. ఇది కాక కాశ్మీర్ ఫైల్స్, గాంగుభాయి కథియవాడి, బచ్పన్ పాండే వంటి వంటి బాలీవుడ్ సినిమాలు మంచి కలెక్షన్లను కూడా అందుకుంటున్నాయి.

అయితే భారీ అంచనాల మధ్య వస్తున్న ఆర్ఆర్ఆర్ థియేటర్లలోకి రాగానే మిగతా సినిమాల కలెక్షన్లో మాట అటు ఉంచి నా, అసలు థియేటర్లలో ఉంటాయా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఆర్ఆర్ఆర్ రాకతో ఈ సినిమాలన్నీ థియేటర్ల నుంచి మాయం అయిపోతాయి అని ట్రేడ్ వర్గాల విశ్లేషణ కూడా. ఇక మొదటి రోజు ఆర్ ఆర్ ఆర్ సినిమా కి వచ్చే రెస్పాన్స్ ఓ రేంజ్ లో ఉంటే మిగతా థియేటర్లలో ఈ సినిమానే ప్రదర్శించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.