RRR : అలా విడుదలవుతున్న తొలి భారతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ అరుదైన రికార్డ్!

RRR: రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీసిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా మొదటిసారిగా ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటించారు. ఈ సినిమా జనవరికే పూర్తయి విడుదలకు సిద్ధమైన కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ఇపుడు మార్చి 25 న విడుదలకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రచారాన్ని జనవరిలో పెద్ద ఎత్తున చేసిన చిత్ర యూనిట్ ఇపుడు అంత ఖర్చు పెట్టకుండా సినిమా విడుదలకు వారం ఉండగా మొదలుపెడుతోంది.

బెంగళూరు నగరం పెద్ద ఈవెంట్ ప్లాన్ చేసారు రాజమౌళి ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు మరోవైపు హడావిడి మొదలెట్టారు. ఇటీవలే ‘నెత్తురు మరిగితే ఎత్తర జెండా ‘పాట ప్రోమోను విడుదల చేసారు సినిమా బృందం.ఇది  యూట్యూబ్ లో మంచి వ్యూస్ సాధించి వైరల్ అవుతోంది ఇక ఫ్యాన్స్ వినూత్నంగా ప్రచారం చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఇక ఇపుడు ఇంకో వార్త ఈ సినిమా గురించి చక్కర్లు కొడుతోంది.

ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం డాల్బీ ఫార్మాట్‌లో రిలీజ్ కానున్న తొలి భారతీయ సినిమా గానూ రికార్డు సృష్టించనుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశారు. 197 డాల్బీ స్క్రీన్స్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ అలరించనుంది. తాజాగా సౌదీ అరేబియాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఆప్ డేట్ వచ్చేసింది. ఇప్పటి వరకు ఏ ఇతర తెలుగు సినిమాకు ఈ ఘనత దక్కలేదు. అక్కడ ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌… 24వ తేదీ నుంచే ప్రీమియర్ షోలతో అలరించనుంది.