RRR: ఇద్దరు పెద్ద హీరోలు కలిసి నటించడం అన్ని సినిమా పరిశ్రమల్లో మాములే అయితే తెలుగులో మాత్రం చాలా తక్కువగా ఇద్దరు పెద్ద హీరోలు ఒక సినిమాలో కలిసి నటిస్తుంటారు. దీనికి ముఖ్య కారణం ఇద్దరి హీరోల ఇమేజ్ ను దర్శకుడు బ్యాలెన్స్ చేయగలగడం. ఇదే మల్టీ స్టార్రర్ సినిమాలు ఎక్కువగా రాకపోడానికి కారణం. మన తెలుగు హీరోలు ఇమేజ్ చట్రం నుండి ఇపుడిపుడే బయట పడుతున్నారు. ఇద్దరు హీరోలు కలిసి సినిమాలు తీయడం ప్రారంభించారు.
ఇపుడు ఆర్ ఆర్ ఆర్ సినిమాతో రాజమౌళి ఇద్దరు పెద్ద హీరోలను ఒకే స్క్రీన్ పై చూపిస్తున్నాడు. కథ పరంగా ఇద్దరు హీరోలకు న్యాయం చేస్తాడు రాజమౌళి. టాలీవుడ్ టాప్ హీరోస్ అయినా ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరిని ఒకే సినిమాలో సమంగా చూపించబోతున్నాడు. ఏ మాత్రం తేడా జరిగిన ఆ ప్రభావం రాజమౌళి తదుపరి చిత్రాలపై ఖచ్చితంగా ఉంటుంది.
ఇపుడు ఈ చర్చంతా అభిమానుల ఆలోచనల గురించే. సినిమా ఇంకా కొన్ని రోజుల్లో విడుదల అవబోతున్న తరుణంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానుల మధ్య మాటల యుద్ధం మొదలయింది.మా హీరో పాత్రకు ఎక్కువ ప్రాముఖ్యం ఉందని ఒక హీరో ఫ్యాన్స్ అంటుంటే మరో హీరో ఫ్యాన్స్ లేదు మా హీరో కే ఎక్కువగా స్క్రీన్ స్పేస్ ఉంది అంటూ వాదన కు దిగారు సామాజిక మధ్యమాల వేదికగా.
ఈ వాదనలు చాలా మురికిగా తయారవుతున్నాయి. హీరోలను అభిమానించడం తప్పు కాదు కానీ మరీ ఎంత పిచ్చి ఉండకూడదు. ఇతర హీరోలను వారి అభిమానులను కించపరిచే విధంగా మాట్లాడకూడదని విశ్లేషకులు భావిస్తున్నారు. మరీ సినిమా విడుదలకు ముందే ఇలా ఉంటే విడుదలయ్యాక మెగా నందమూరి అభిమానుల మధ్య గొడవలు ఇంకేలా ఉండబోతున్నాయో చూడాల్సిందే.