RRR : నార్త్ అమెరికా లో 100కోట్లా క్లబ్ లోకి ఆర్ఆర్ఆర్….!

RRR : ఆర్ఆర్ఆర్ ప్రభంజనం ఇపుడే తగ్గేలా కనిపించడం లేదు. ఎప్పటికప్పుడు విశ్లేషకుల అంచనాలను తలక్రిందులు చేస్తూ దూసుకుపోతోంది. చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ కష్టమంటూ వార్తలోచ్చిన అందరిని నోరేళ్ళబెట్టుకునేలా చేసేసింది ఈ జక్కన్న చెక్కిన చిత్రం. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ అన్ని చోట్ల నక్కి నక్కి గాదే తొక్కుకుంటూ పోవాలే అన్న చందంగా దుమ్ములేపుతోంది. నేను దిగనంత వరకే అంటూ విదేశాల్లో కూడా సత్తా చాటుతోంది.

ఆర్ఆర్ఆర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 451 కోట్ల బిజినెస్ తో 453 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగింది. అయితే బ్రేక్ ఈవెన్ సాధించి ఈ సినిమా 75.50 కోట్ల ప్రాఫిట్‌ను సొంతం చేసుకుంది. ఇక ప్రచారంలో భాగంగా ఇటీవల హుషారైనా పాట ఎత్తర జెండా వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. రామ జోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట ను విశాల్ మిశ్రా, పృధ్వీ చంద్ర, ఎంఎం కీరవాణి, సాహితి చాగంటి, హారిక నారాయణ్‌లు పాడారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లోను వీర విహారం చేస్తోంది. మరే సినిమాకు అందనంత ఎత్తులో నిల్చుంటోంది. ఇక బాలీవుడ్ లో మిగిలిన సినిమాలను నలిపేస్తోంది. ఇక 1000కోట్లా క్లబ్ లోకి అడుగుపెట్టి టాప్ 3 సినిమాల్లో 3 వ స్థానం లోకి వచ్చింది. ఇక రెండో స్థానంలో రాజమౌళి చెక్కిన బాహుబలి2 సినిమా నిలిచింది. ఇది 1819 కోట్లు కలెక్షన్లు సాధించింది. ప్రస్తుతానికి రాజమౌళి తీసిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ 3వ స్థానంలో ఉంది. ఈ సినిమా అధికారిక లెక్కల ప్రకారం.. ఇప్పటిదాకా 1000 కోట్లు వసూళ్లు గ్రాస్ సాధించి దూసుకెళుతోంది.. ఇక నాలుగో స్థానంలో సల్మాన్ ఖాన్ నటించిన భజరంగీ భాయిజాన్ ఉంది. ఈ సినిమా సల్మాన్ కెరీర్ లోనే అత్యధికంగా 969 కోట్లు కలెక్ట్ చేసింది.