జపాన్లో “RRR” మరో యూనిక్ క్రేజీ రికార్డు.!

RRR_1666167871

తెలుగు సినిమాకి అయితే భారత దేశ సినిమాకి కూడా ఎంతో గర్వకారణంగా నిలిచిన సెన్సేషనల్ హిట్ సినిమా ట్రిపుల్ ఆర్ (RRR) సక్సెస్ ఇప్పటికీ నెక్స్ట్ లెవెల్లో కొనసాగుతుంది. అయితే మన తెలుగులో మరియు హిందీలో రిలీజ్ రెస్పాన్స్ లు అనుకుంటే ఈ సినిమా జపాన్ దేశంలో మైండ్ బ్లాకింగ్ రన్ తో దూసుకెళ్తూ సెన్సేషన్ గా నిల్చింది.

ఇక యూఎస్ లో అయితే ఈ భారీ సినిమా ఏకంగా 100 రోజులు రన్ ని 100 సెంటర్స్ కి పైగా రన్ అవ్వడం అంతే కాకుండా 1 బిలియన్ జపాన్ వసూళ్లు అలాగే 1.5 మిలియన్ కూడా అందుకొని ఎన్నెన్నో కనీ వినీ ఎరుగని రీతి రికార్డ్స్ అయితే ఈ సినిమా నెలకొల్పింది.

ఇక ఈ భారీ సినిమా అయితే తాజాగా జపాన్ లో మరో యూనిక్ రికార్డు నెలకొల్పింది. అక్కడ ఈ సినిమా ఏకంగా 1 మిలియన్ ఫుట్ ఫాల్స్ ని సొంతం చేసుకుంది. అంటే అక్కడ ఏకంగా 10 లక్షలకి పైగా టికెట్స్ సొంతం చేసుకుంది.

దీనితో రాజమౌళి కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ జపాన్ ఆడియెన్స్ కి 1 మిలియన్ హగ్స్ ని అందిస్తున్నామని జక్కన్న ఎంతో ఆనందంగా సంతోషం అయితే వ్యక్తం చేశారు. మొత్తానికి అయితే ఇలా ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇంకా ఎన్నెన్నో రికార్డులు సృష్టిస్తుంది అని చెప్పాలి. మరి ఈ భారీ సినిమాలో హీరోలు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు నటించిన సంగతి తెలిసిందే.