బాక్సాఫీస్ : అక్కడ “బాహుబలి” కి 30 వారాలు “RRR” కి కేవలం 3 వారాలే.!

ఇండియాస్ టాప్ దర్శకుడు రాజమౌళి తాను చేసిన లాస్ట్ చిత్రాలు బాహుబలి 2 అలాగే ట్రిపుల్ ఆర్(RRR) చిత్రాలు పాన్ ఇండియా వైడ్ సెన్సేషనల్ హిట్ అయ్యి భారీ రీచ్ ని సొంతం చేసుకున్నాయి. అలాగే ఈ తర్వాత అయితే తాను ఇద్దరు సూపర్ స్టార్స్ రామ్ చరణ్ అలాగే ఎన్టీఆర్ లతో చేసిన భారీ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) బాహుబలి 2 తో పోలిస్తే తక్కువ వసూళ్లే అనుకున్నా కానీ ఆ సినిమాకి మించి రీచ్ ని ఈ చిత్రం సొంతం చేసుకుంది.

మరి ఈ సినిమా ఇప్పుడు ఇటీవల జపాన్ దేశంలో రిలీజ్ కాగా అక్కడ కనీ వినీ ఎరుగని రికార్డులు నమోదు చేస్తుంది. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే మన దగ్గర కన్నా జపాన్ లో సినిమాలు లాంగ్ రన్ లో థియేటర్స్ లో చూస్తారు. ఏకంగా ముప్ఫైయేసి వారాలు కూడా అక్కడ జనం థియేటర్స్ లోనే సినిమాలు చూస్తారంటే అర్ధం చేసుకోండి.

ఇక అలాగే బాహుబలి 2 చిత్రం జపాన్ లో 32 వారాల్లో నమోదు చేసిన రికార్డును రారు కేవలం అంటే కేవలం మూడు వారాలు పూర్తయ్యేసరికి బద్దలు కొట్టేసింది. అక్కడ బాక్సాఫీస్ దగ్గర 250 మిలియన్ జపాన్ యిన్స్ వసూలు చేయడానికి బాహుబలి 2 కి 32 వారాలు పట్టగా కానీ ఆర్ ఆర్ ఆర్ కి జస్ట్ 3 వారాలు మాత్రమే పట్టడం క్రేజీగా మారింది. దీనితో ఈ చిత్రం జపాన్ లో ఎంత పెద్ద సంచలన విజయం నమోదు చేసిందో ఊహించుకోవచ్చు.